నా ఓటు పోలేదు.. మే 12న ఓటేస్తున్నా, మీరు రెడీనా: కోహ్లీ

By Siva KodatiFirst Published Apr 28, 2019, 4:14 PM IST
Highlights

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఈసారి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేదంటూ కథనాలు వస్తున్న నేపథ్యంలో తాను మే 12న గురుగ్రామ్‌లో ఓటు వేస్తున్నానని తెలిపాడు కోహ్లీ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఈసారి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేదంటూ కథనాలు వస్తున్న నేపథ్యంలో తాను మే 12న గురుగ్రామ్‌లో ఓటు వేస్తున్నానని తెలిపాడు కోహ్లీ. ఢిల్లీకి చెందిన కోహ్లీ ప్రస్తుతం భార్యతో కలిసి ముంబైలో నివసిస్తున్నాడు.. ముందు అక్కడే ఓటు వేయాలని భావించాడు.

అయితే నిర్ణీత గడువు ముగిసేలోగా ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేయకపోవడంతో ఈ ఎన్నికల్లో అతను ఓటు వేసే అవకాశం లేదని వార్తలు వచ్చాయి. దీంతో అభిమానులు తీవ్రంగా నిరాశకు గురయ్యారు. వారిని సంతృప్తి పరిచేందుకు గాను మే 12న ఓటు వేస్తున్నానని ఓటరు ఐడీ కార్డును ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు విరాట్.

మరోవైపు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు సెలబ్రిటీలంతా ముందుకొచ్చి ప్రజలను చైతన్యం చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా పోలింగ్ శాతాన్ని పెంచే సరికొత్త రికార్డు నెలకొల్పాలంటూ కోహ్లీకి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు మోడీ.

కాగా కోహ్లీ ఓటు విషయంపై ఓ ఈసీ స్పందించింది. విరాట్ కోహ్లీ దరఖాస్తు ఆలస్యంగా అందిందని.. అందుకే దానిని పెండింగ్‌లో పెట్టామని .. ఈ దఫా అతను లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయలేదని వచ్చే ఎన్నికల దాకా వేచి చూడాల్సిందేనని చెప్పారు. అయితే కోహ్లీ తన పాత ఓటరు కార్డుతో మే 12న గురుగ్రామ్‌లో ఓటు వేయనున్నాడు. 

 

click me!