మ్యాచ్‌లో ఓటమి: అభిమానిపై ఫస్ట్రేషన్ తీర్చుకున్న స్టార్ ప్లేయర్

By Siva Kodati  |  First Published Apr 28, 2019, 5:10 PM IST

వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ నెయ్‌మార్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. తనను ఫోటో తీస్తున్న అభిమానిపై అతను చేయి చేసుకున్నాడు.


వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ నెయ్‌మార్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. తనను ఫోటో తీస్తున్న అభిమానిపై అతను చేయి చేసుకున్నాడు.

వివరాల్లోకి వెళితే.. ఫ్రెంచ్ కప్‌ ఫైనల్లో భాగంగా ఆదివారం పారిస్ సెయింట్-జర్మన్ ఎఫ్‌సీ రెన్నెైస్‌తో తలపడింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌ను పెనాల్టీ దశలో 5-6 తేడాతో రెన్నైస్‌ గెలుచుకుంది.

Latest Videos

undefined

ఈ మ్యాచ్‌లో నెయ్‌మార్ 21వ నిమిషంలో గోల్ చేశాడు. ఓటమి అనంతరం అతను తన జట్టు సభ్యులతో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళుతున్నాడు. ఆ సమయంలో గ్యాలరీలో కూర్చొన్న ఓ వ్యక్తి ఆటగాళ్లను తన మొబైల్ ఫోన్‌తో చిత్రీకరిస్తున్నాడు.

దీనిని గమనించిన నెయ్‌మార్ అభిమాని వద్ద ఆగి సెల్‌ఫోన్‌కు చెయ్యి అడ్డుపెట్టాడు. దీనిపై ఫ్యాన్ ..నెయ్‌మార్‌ను ప్రశ్నించడంతో ఆగ్రహించిన అతను అభిమాని ముఖంపై పంచ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనిని అక్కడి కెమెరాలు క్లిక్ మనిపించడంతో అది కాస్తా వైరల్ అవుతోంది. నెయ్‌మార్ ప్రవర్తనను అభిమానులు తప్పుబడుతున్నారు. 

click me!