రక్తం కారుతున్నా బ్యాట్ వదలని వాట్సన్... ప్రశంసల వర్షం

Published : May 14, 2019, 10:42 AM IST
రక్తం కారుతున్నా బ్యాట్ వదలని వాట్సన్... ప్రశంసల వర్షం

సారాంశం

ఈ సీజన్ కి ఐపీఎల్ ముగిసింది. నాలుగోసారి ముంబయి ఇండియన్స్...ఐపీఎల్ కప్ ని చేజిక్కించుకుంది. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చివరి వరకు పోరాడి ఓడింది. 

ఈ సీజన్ కి ఐపీఎల్ ముగిసింది. నాలుగోసారి ముంబయి ఇండియన్స్...ఐపీఎల్ కప్ ని చేజిక్కించుకుంది. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చివరి వరకు పోరాడి ఓడింది. కేవలం ఒక్క పరుగుతో చెన్నై వెనుదిరిగింది. ఈ మ్యాచ్ లో చెన్నైని ఓడించేందుకు వాట్సన్ పడిన శ్రమ అందరినీ ఆకట్టుకుంది. అయితే... ఈ మ్యాచ్ లో వాట్సన్...తన కాలికి రక్తం కారుతున్నా... ఆటని కొనసాగించాడని చాలా ఆలస్యంగా తెలిసింది.

మ్యాచ్ అయిపోయాక ఈ విషయాన్ని హర్భజన్ సింగ్... ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించాడు. అతడి పోరాటపటిమను మెచ్చుకున్నాడు. ఎడమ మోకాలి ప్రాంతం రక్తంతో తడిసినా పట్టించుకోకుండా బ్యాటింగ్‌ చేస్తున్న వాట్సన్‌ ఫొటోను కూడా అతడు పెట్టాడు. మ్యాచ్‌ సందర్భంగా అతడు తన గాయం గురించి ఎవరికీ చెప్పలేదని భజ్జీ చెప్పాడు. మ్యాచ్‌ అనంతరం వాట్సన్‌ గాయానికి ఆరు కుట్లు పడ్డాయని తెలిపాడు.

హర్భజన్ పోస్టుకి నెటిజన్లు విపరీతంగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా వాట్సన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆట మీద అతనికి ఉన్న అంకిత భావాన్ని చూసిన చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !