చెన్నై ఓటమికి కారణమతడే: అభిమానుల ఆగ్రహం

By Arun Kumar PFirst Published May 13, 2019, 11:05 PM IST
Highlights

ఐపిఎల్ 2019 ఆరంభంనుండి ఫైనల్ వరకు ప్రతి జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ దే పైచేయిగా నిలిచింది. కానీ  ఒక్క ముంబై ఇండియన్స్  పై మాత్రం ఆ జట్టు ఒక్కటంటే ఒక్క విజయాన్ని సాధించలేకపోయింది. లీగ్ దశలోనే కాకుండా క్వాలిఫయర్ మ్యాచులో కూడా ముంబై చేతిలో చెన్నై ఘోర ఓటమిని చవిచూసింది. ఇదే ఆటతీరు ఫైనల్లో కూడా కొనసాగించిన చెన్నై ఐపిఎల్ 2019 ట్రోఫీని చేజేతులా జారవిడుచుకుని ముంబై చేతిలో పెట్టింది. 

హైదరాబాద్ ఉప్పల్  స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ చివరి ఓవర్లలో కీలక బ్యాట్ మెన్స్ రనౌట్లవడంతో చెన్నై ఓడిపోవాల్సి వచ్చింది. ముఖ్యంగా షేన్ వాట్సన్ రనౌట్ మ్యాచ్ గతినే మలుపుతిప్పింది. దీంతో వాట్సన్ ఔటవడానికి కారణమైన రవీంద్ర జడేజాపై చెన్నై అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. 

150 పరుగుల  లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైని షేన్ వాట్సన్(80 పరుగులు) ఆదుకున్నాడు. బ్యాట్ మెన్స్ అందరూ విఫలమైనా అతడొక్కడే ఒంటరి పోరాటం చేసి చెన్నైని విజయపుటంచుల వరకు తీసుకువచ్చాడు. ఇలా చివరి ఓవర్లో 9 పరుగులు చేస్తే విజయాన్ని అందుకునే స్థాయిలో చెన్నై నిలించింది. క్రీజులో కూడా మంచి ఊపుమీదున్న వాట్సన్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాలు  వున్నారు. దీంతో అందరూ సీఎస్కే విజయం ఖాయమనుకున్నారు. 

ఆ సమయంలోనే ముంబై కెప్టెన్ రోహిత్ చేతిలోంచి బాల్ అందుకున్న లసిత్ మలింగ మాయ చేశాడు. అతడు వేసిన మొదటి మూడు బంతులకే నాలుగు పరుగులు రాగా మిగతా మూడు బంతుల్లో ఐదు పరుగులు చేయాల్సి వుంది. ఈ సమయంలో నాలుగో బంతిని వాట్సన్ బౌండరీవైపు బాదాడు. సునాయాసంగా ఓ పరుగు తీసుకున్న వాట్సన్ ను జడేజా రెండో పరుగు కోసం పిలిచాడుజ ఇదే చెన్నై కొంప ముంచింది. రెండో పరుగు కోసం ప్రయత్నించిన వాట్సన్‌ రనౌటయ్యాడు. 

ఆ తర్వాత 2 బంతుల్లో 4 పరుగులు సాధించలేక చెన్నై ఓటమిపాలయ్యింది. ఇలా కేవలం మ్యాచ్ నే కాదు ఐపిఎల్ ట్రోఫీని కోల్పోయింది. జడేజా చేసిన ఒక్క తప్పుతో జట్టు మొత్తం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. దీంతో సీఎస్కే అభిమానులు జడేజాపై సోషల్ మీడియాలో విరుచుకుపడుతన్నారు. వివిద రకాలుగా అతడిపై కామెంట్స్ చేస్తూ తమ కోపాన్ని వ్యక్తపరుస్తున్నారు.
 
click me!