Tokyo Paralympics:బాడ్మింటన్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లిన నోయిడా కలెక్టర్ సుహాస్ యతిరాజ్

By team teluguFirst Published Sep 4, 2021, 9:01 AM IST
Highlights

సెమీఫైనల్ లో ఇండోనేషియా ఆటగాడిపై వరుస గేముల్లో విజయం సాధించి ఫైనల్స్ లోకి దూసుకెళ్లాడు భారత బాడ్మింటన్ స్టార్ సుహాస్ యతిరాజ్. 

భారత పారా బాడ్మింటన్ స్టార్ సుహాస్ యతిరాజ్ కూడా బాడ్మింటన్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లాడు. SL -4 కేటగిరీలో భారత స్టార్ ప్లేయర్ సుహాస్ ఇండోనేషియా ప్లేయర్, వరల్డ్ నెంబర్ 4 ఫ్రెడీ పై వరుస సెట్లలో విజయం సాధించి ఫైనల్స్ లోకి దూసుకెళ్లి భారత్ కి కనీసం మరొక రజతాన్ని ఖాయం చేసాడు. 

ఆది నుంచి దూకుడు ప్రదర్శించిన సుహాస్ మిడ్ గేమ్ ఇంటర్వెల్ అప్పటికే సాలిడ్ 11-1 లీడ్ తో అభేద్యమైన స్థానంలో నిలిచాడు. ఆ తరువాత కూడా ఆ గేమ్ మొత్తాన్ని డామినేట్ చేస్తూ... 21-9 తో గేమ్ ను కైవసం చేసుకున్నాడు. రెండవ సెట్ ను కూడా 21-15 తో కైవాదసం చేసుకొని ఫైనల్స్ లోకి దూసుకెళ్లాడు కలెక్టర్ సాబ్. 

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సుహాస్ 2007 బ్యాచ్ యూపీ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్. ప్రస్తుతం గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నాడు.ఫైనల్ లో సుహాస్ యతిరాజ్ ఫ్రెంచ్ ప్లేయర్ మజ్యుర్ తో తలపడనున్నాడు. 

మరో సెమి ఫైనల్ మ్యాచులో మరో భారత ప్లేయర్ తరుణ్...  ఫ్రెంచ్ ఆటగాడు మజ్యుర్ తో తలపడ్డ మ్యాచులో ఓటమిచెంది కాంస్య పతక పోరులో నిలిచాడు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచులో తరుణ్ పోరాడి ఓడాడు. తొలి సెట్ ను మజ్యుర్ గెలవగా, రెండవ సెట్ ని తరుణ్ కైవసం చేసుకొని మూడవ గేమ్ లో తలపడ్డారు. మూడవ గేమ్ లో లూకా మజ్యుర్ అద్భుతమైన ఆటతీరుతో గేమ్ ని కైవసం చేసుకొని ఫైనల్స్ లోకి దూసుకెళ్లాడు.  

కాంస్యం పోరులో సుహాస్ చేతిలో ఓడిన ఇండోనేషియా ఆటగాడు ఫ్రెడితో తరుణ్ తలపడనున్నాడు. తరుణ్ పై నెగ్గిన ల్యూక మజ్యుర్ తో సుహాస్ ఫైనల్ లో తలపడనున్నాడు. 

ఇక ఉదయం జరిగిన SL -3 బాడ్మింటన్ సెమిస్ లో వరల్డ్ నెంబర్ 1 ప్రమోద్ భగత్ జపాన్ కి చెందిన స్టార్ ప్లేయర్ ఫుజియారా పై 21-11, 21-16 పాయింట్లతో వరుస గేముల్లో ఫైనల్స్ లోకి దూసుకెళ్లాడు. ఆది నుంచి కూడా ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ప్రమోద్ ఎక్కడా కూడా ప్రత్యర్థికి కోలుకునే అవకాదం ఇవ్వకుండా.. మ్యాచ్ ను కైవసం చేసుకొని భారత్ కి బ్యాడ్మింటన్ లో పతకాన్ని ఖాయం చేసాడు. బాడ్మింటన్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లిన ప్లేయర్ గా కూడా రికార్డు సృష్టించాడు ప్రమోద్. 

మరోవైపు మరో భారతీయ ఆటగాడు మనోజ్ సర్కార్ బ్రిటన్ ఆటగాడు డేనియల్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచులో ఓటమి చెంది కాంస్యం కోసం పోరాడనున్నాడు. వాస్తవానికి SL -3 కేటగిరీలో ఇద్దరు భారత్ ప్లేయర్స్ ఫైనల్ ఆడాలని భారతీయ అభిమానులు కోరుకున్నప్పటికీ... బ్రిటన్ ఆటగాడి అద్భుతమైన ఆటతీరు ఆ కలను సాకారం కానివ్వలేదు. జపాన్ ప్లేయర్ ఫుజియారా తో మనోజ్ కాంస్య పతకపోరులో తలపడనున్నాడు. 

click me!