US Open: మిక్స్ డ్ డబుల్స్ లోనూ సానియా జోడికి నిరాశ..!

Published : Sep 04, 2021, 07:59 AM ISTUpdated : Sep 04, 2021, 08:06 AM IST
US Open: మిక్స్ డ్ డబుల్స్ లోనూ సానియా జోడికి నిరాశ..!

సారాంశం

మిక్స్ డ్ డబుల్స్ లో సానియా మీర్జా, రాజీవ్ రామ్ జోడి తొలి రౌండ్ లోనే వెను దిరిగింది.

ఈ ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్  అయిన యూఎస్ ఓపెన్‌లో భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు మరోసారి నిరాశ ఎదురైంది. మహిళల డబుల్స్ బరిలోకి కోకో వాండేవ్ తో కలిసి పోటీలోకి దిగిన సానియా మీర్జా.. తొలి రౌండ్ లో ఓటమి పాలైంది. అయితే.. మిక్స్ డ్ డబుల్స్ లో అయినా.. సానియా తన సత్తా చాటకపోతుందా అని అభిమానులు ఆశగా ఎదురుచూశారు. కానీ.. అక్కడ కూడా నిరాశే ఎదురవ్వడం గమనార్హం.

మిక్స్ డ్ డబుల్స్ లో సానియా మీర్జా, రాజీవ్ రామ్ జోడి తొలి రౌండ్ లోనే వెను దిరిగింది. క్వెటా పెష్కే ,  కెవిన్ క్రావిట్జ్‌ల తో పోటీ పడి.. తొలి రౌండ్ లోనే ఓటమిపాలయ్యారు. దీంతో.. ఇంటి ముఖం పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా.. ఈ మ్యాచ్ కి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

యూఎస్ ఓపెన్ 2025 ఫైనల్: సబాలెంకా vs అనిసిమోవా.. ఎవరు ట్రోఫీ గెలుస్తారు?
Vece Paes: లియాండర్‌ పేస్‌కు పితృవియోగం.. ఒలింపియన్ వేస్ పేస్ కన్నుమూత