Tokyo Olympics: టేబుల్ టెన్నిస్ 3వ రౌండ్లోకి దూసుకెళ్లిన శరత్ కమల్

Published : Jul 26, 2021, 08:21 AM IST
Tokyo Olympics: టేబుల్ టెన్నిస్ 3వ రౌండ్లోకి దూసుకెళ్లిన శరత్ కమల్

సారాంశం

భారత టేబుల్ టెన్నిస్ స్టార్ ఆచంట శరత్ కమల్ మూడవ రౌండ్లోకి దూసుకెళ్లాడు.

భారత టేబుల్ టెన్నిస్ స్టార్ ఆచంట శరత్ కమల్ మూడవ రౌండ్లోకి దూసుకెళ్లాడు. అద్భుతమైన ఆటతీరును కనబర్చి పుంజుకొని మ్యాచును కైవసం చేసుకున్నాడు ఈ 39 ఏండ్ల స్టార్ ప్లేయర్. పోర్చుగల్ కి చెందిన అపొలోనియా తో జరిగిన మ్యాచులో తొలుత తడబడ్డ ఆ తరువాత పూర్తి ఆధిక్యాన్ని కనబరిచాడు. 

తొలి గేమ్ ను పోర్చుగల్ ప్లేయర్ 11-2 తో కైవసం చేసుకున్నాడు. ఎక్కడా కూడా శరత్ కమల్ పోటీ ఇచ్చినట్టుగా కూడా కనబడలేదు. కానీ తరువాతి రౌండ్లోనే పుంజుకున్న శరత్ కమల్ 5 స్ట్రెయిట్ పాయింట్లను సాధించాడు. ఆతరువాత పోర్చుగీస్ ప్లేయర్ ఒకింత పోటీ ఇచ్చినప్పటికీ... తనకున్న లీడ్ వల్ల 11-8తో గేమ్ గెలిచి స్కోర్ ను 1-1 తో సమం చేసాడు. 

తరువాతి రౌండ్లో కూడా ఆధిక్యతను కనబర్చిన భారత స్టార్... 5 వరుస పాయింట్లను మరోసారి సాధించాడు. మరోసారి పోర్చుగల్ ప్లేయర్ గట్టిగానే పోరాడినప్పటికీ... శరత్ తన కూల్ ని కోల్పోకుండా 11-5తో గేమ్ ను కైవసం చేసుకొని 2-1 లీడ్ లోకి దూసుకెళ్లాడు. 

తదుపరి గేమ్ ను పోర్చుగల్ ప్లేయర్ సాధించి 2-2 తో స్కోర్ ని సమం చేసాడు. నాలుగవ గేమ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. నువ్వా నేనా అని సాగిన గేమ్ లో చివరకు పోర్చుగల్ ప్లేయర్ విజయం సాధించాడు. 

ఐదవ గేమ్ ని శరత్ 11-6 తో గెలిచాడు. మధ్యలో తీసుకున్న టైం అవుట్ శరత్ కి ఉపయుక్తకరంగా మారింది. ఆ తరువాత బ్యాక్ హ్యాండ్ షాట్లతో ఆకట్టుకున్న శరత్ కమల్ ఎక్కడా వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా గేమ్ ని ముగించేశాడు. మిగిలిన రెండు రౌండ్లలో ఒక్కటి గెలిస్తే సరిపోయేలా ఈ గేమ్ అతనికి సహాయం చేసింది. 

తదుపరి రౌండ్ ను ఎలాగైనా గెల్చుకొని దెచిదెర్ అయిన ఆఖరి గేమ్ లో తలపడాలని పోర్చుగల్ ప్లేయర్ ప్రయత్నిస్తుండగా... ఈ గేమ్ గెలిచి ఈ రౌండ్ ను ముగించాలని శరత్ చూసాడు. టవల్ బ్రేక్ సమయానికి ఇద్దరి స్కోర్ 6-6 అంటే అర్థం చేసుకోవచ్చు... మ్యాచ్ ఎంత హోరాహోరీగా సాగింది..!

ఇక ఆతరువాత ఇద్దరు కూడా 8-8 తో సమఉజ్జిలుగా నిలిచిన తరుణంలో శరత్ 9-8తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు.  పోర్చుగల్ ప్లేయర్ టైం అవుట్ తీసుకున్నా అది అతనికి సహకరించలేదు. శరత్ మరో రెండు పాయింట్లు సాధించి గేమ్ ను మ్యాచ్ ను కైవసం చేసుకొని మూడవ రౌండ్లోకి దూసుకెళ్లాడు. 

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !