Tokyo Olympics: క్వార్టర్స్ లోకి దూసుకెళ్లిన భారత ఆర్చర్లు

By team teluguFirst Published Jul 26, 2021, 7:55 AM IST
Highlights

భారత ఆర్చరీ జట్టు నేడు జరిగిన మ్యాచులో కజకిస్తాన్ బృందాన్ని ఓడించి క్వార్టర్స్ కు చేరింది. అతాను దాస్,ప్రవీణ్ జాదవ్,తరుణ్ దీప్ రాయ్ లతో కూడిన భారత ఆర్చర్లు తమ స్థాయికి తగ్గ ప్రదర్శనను చేసి క్వార్టర్స్ కి చేరారు. 

భారత ఆర్చర్లు నేడు భారత్ కి మరో బ్రేక్ త్రూ ని అందించారు. భారత ఆర్చరీ జట్టు నేడు జరిగిన మ్యాచులో కజకిస్తాన్ బృందాన్ని ఓడించి క్వార్టర్స్ కు చేరింది. అతాను దాస్,ప్రవీణ్ జాదవ్,తరుణ్ దీప్ రాయ్ లతో కూడిన భారత ఆర్చర్లు తమ స్థాయికి తగ్గ ప్రదర్శనను చేసి క్వార్టర్స్ కి చేరారు. 

ఒక్కో బృందానికి 6 ఛాన్సుల చొప్పున సాగిన మ్యాచులో భారత ఆర్చర్లు తొలి రౌండ్లో రెండు పాయింట్ల ఆధిక్యాన్ని సాధించారు. టోక్యోలో గాలులు బలంగా వీస్తున్నప్పటికీ... భారత ఆర్చర్లు ఎక్కడా తమ గురి తప్పకుండా కజకిస్తాన్ ఆర్చర్లు సాధించిన పాయింట్ల కన్నా ఎక్కువ సాధించి తొలి సెట్ ను కైవసం చేసుకున్నారు. 

రెండవ రౌండ్లో కజక్ ఆర్చర్లు తొలి ఛాన్స్ లో 8-8-8 సాధించగా, భారత ఆర్చర్లు 10-9-9 సాధించారు. మరొక ఛాన్స్ లో వారు 9-9-8 పాయింట్లను సాధించారు. భారత ఆర్చర్లు మంచి లీడ్ సాధిస్తారు అనుకుంటున్నా తరుణంలో తరుణ్,జాదవ్ లు 8,7 పాయింట్లు మాత్రమే సాధించి నిరాశపరిచాడు. అతాను దాస్ మరొక సారి పూర్తి బాధ్యత తీసుకొని 9 పాయింట్లు సాధించడంతో భారత్ రెండవ సెట్ ను కూడా కైవసం చేసుకుంది. 

మూడవ సెట్ లో కజక్ ఆర్చర్లు తమ పూర్తి స్థాయి ప్రదర్శనతో సెట్ ను కైవసం చేసుకున్నారు. భారత ఆర్చర్లలో ఇద్దరు ఆర్చర్లు బాణాలు వేసేకన్నా ముందే సెట్ వారి వశం అయినట్టు అర్థమైపోయింది. ప్రవీణ్,అతాను దాస్ ఇద్దరు కూడా పర్ఫెక్ట్ టెన్స్ సాధించి భారత్ లీడ్ తగ్గకుండా కాపాడారు. 

నాలుగవ సెట్ తొలి రౌండ్ లో కజఖ్ ఆర్చర్లు 9-9-10 పాయింట్లను సాధించారు. భారత ఏస్ ఆర్చర్ అతాను దాస్ మరొకసారి 10 పాయింట్లు సాధించగా ప్రవీణ్ 8,రాయ్ 9 పాయింట్లను సాధించారు. కజక్ ఒక పాయింట్ ఆధిక్యంలో నిలిచింది. 

ఆ తరువాతి ఛాన్స్ లో కజఖ్ ఆర్చర్లు 26 పాయింట్లు మాత్రమే సాధించడంతో భారత్ ఆర్చర్లు మ్యాచ్ ను సునాయాసంగా కైవసం చేసుకున్నారు. రాయ్ 8 పాయింట్లు సాధించగా ప్రవీణ్,అతాను దాస్ లు పదేసి పాయింట్లు సాధించి క్వార్టర్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. 

click me!