Tokyo Olympics: చరిత్ర సృష్టించిన భారత ఫెన్సర్ భవానీదేవి... తొలి రౌండ్లో గెలుపు

By telugu teamFirst Published Jul 26, 2021, 6:36 AM IST
Highlights

తొలిసారి  ఫెన్సింగ్ ఈవెంట్లోకి ఎంట్రీ ఇచ్చిన భారత్.... తొలి రౌండ్లో అద్భుత విజయాన్ని అందుకుంది. 

ఒలింపిక్స్ లో మూడవ రోజు భారత్ కి మంచి స్టార్ట్ దొరికిందని చెప్పవచ్చు. తొలిసారి  ఫెన్సింగ్ ఈవెంట్లోకి ఎంట్రీ ఇచ్చిన భారత్.... తొలి రౌండ్లో అద్భుత విజయాన్ని అందుకుంది. భారత్ నుంచి పాల్గొంటున్న ఏకైక ఫెన్సర్ భవానీదేవి అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి రెండవ రౌండ్లోకి దూసుకెళ్లింది. 

నేటి ఉదయం జరిగిన మ్యాచులో ట్యునీషియా కి చెందిన ఫెన్సర్ పై 14-3 తేడాతో విజయాన్ని నమోదు చేసి తన తదుపరి రౌండ్లోకి దూసుకెళ్లింది. ప్రపంచ ర్యాంకింగ్స్ లో 42వ స్థానంలో ఉన్న భవానీదేవి... ప్రత్యర్థి నదియా పై గెలిచి భారత్ ను రెన్వావ రౌండ్ కి చేర్చింది. 

ఆట ప్రారంభమైన దగ్గరి నుండి ఎక్కడా కూడాప్రత్యర్ధికి అవకాశం ఇవ్వకుండా వరుస పాయింట్లు సాధించింది. తొలి పీరియడ్ పూర్తవడానికి 8 పాయింట్లు అవసరం కాగా... భవాని దేవి ప్రత్యర్థికి ఎక్కడా కూడా అవకాశం ఇవ్వకుండా 8-0 తో మొదటి పీరియడ్ ను ముగించింది. 

అంతకంతకు ప్రత్యర్థి మీద వరుస దాడులు చేస్తూ తన ఆధిపత్యాన్ని 13-1 కి పెంచుకుంది. చివరకు 15-3 తో గేమ్ ను ముగించింది. (మొదటగా 15 పాయింట్లు ఎవరు సాధిస్తే వారే విజేతలు) అలా తొలి రౌండ్ నెగ్గిన భవానీదేవి... ఇప్పుడు తన రెండవ రౌండ్లో మరికాసేపట్లో ఫ్రాన్స్ కి చెందిన మానన్ బ్రునెట్ తో తలపడనుంది. 

ఇకపోతే ఎన్నో ఆశలు పెట్టుకున్న షూటింగ్ లో భారత షూటర్లు నిరాశపరుస్తూనే ఉన్నారు. ప్రపంచ టాప్ ర్యాంకర్లయిన మహిళా షూటర్లు యశస్విని, మనులు ఫైనల్స్ కి కూడా చేరలేకపోవడంతో భారత అభిమానులు నిరాశ చెందారు. నేడు  కాసేపట్లో పురుషుల స్కీట్ క్వాలిఫైయర్స్ రెండవ  రౌండ్లో అంగద్ బజ్వా, అహ్మద్ ఖాన్ పోటీపడనున్నారు. 

ఇక మొన్న షూటర్ సౌరభ్ చౌదరి ఫైనల్స్ లోకి ప్రవేశించినప్పటికీ... అక్కడ పూర్తిస్థాయి ప్రదర్శన చేయలేక 7వ స్థానంతోనే సరిపెట్టుకున్నాడు. ఇక మహిళా షూటర్లు మొన్నటి ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో కూడా నిరాశపర్చిన విషయం తెలిసిందే. 

మీరాబాయి చాను నిన్న రజత పతకం సాధించి భారత ఖాతాను తెరిచింది. 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో స్నాచ్‌లో మొదటి ప్రయత్నంలో 84 కేజీలను ఎత్తిన మీరాభాయ్, రెండో ప్రయత్నంలో 87కేజీలు ఎత్తి... తొలి హాఫ్‌లో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. చైనా వెయిల్ లిఫ్టర్ హో జీహుయ్ 94 కేజీలు లిప్ట్ చేసి అగ్రస్థానంలో నిలిచింది. 

తొలి ప్రయత్నంలో 110 కేజీలు ఎత్తిన మీరాభాయ్ ఛాను, రెండో ప్రయత్నంలో 115 కేజీలను లిఫ్ట్ చేసి అదరగొట్టింది.  మూడో ప్రయత్నంలో 117 కేజీలను ఎత్తేందుకు చేసేందుకు ప్రయత్నం విఫలమైంది. చైనా వెయిట్ లిఫ్టర్ హో జీహుయ్ టాప్‌లో నిలిచి, స్వర్ణం సాధించింది.

2000 ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన తెలుగు అథ్లెట్ కరణం మల్లీశ్వరి తర్వాత వెయిట్ లిఫ్టింగ్‌లో మెడల్ సాధించిన భారత వెయిట్ లిఫ్టర్‌గా నిలిచింది మీరాభాయి ఛాను... వెయిట్ లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించిన మొట్టమొదటి భారత మహిళా వెయిట్ లిఫ్టర్‌గా సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది మీరాభాయి ఛాను...

click me!