Tokyo Olympics: సెమీస్ లోకి దూసుకెళ్లిన పీవీ సింధు

By team teluguFirst Published Jul 30, 2021, 2:55 PM IST
Highlights

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తన క్వార్టర్స్ లో యమగుచితో తలపడ్డ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో 21-13,22-20 స్కోర్లతో సింధు సెమిస్ లోకి దూసుకెళ్లింది.

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తన క్వార్టర్స్ లో యమగుచితో తలపడ్డ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో 21-13,22-20 స్కోర్లతో సింధు సెమిస్ లోకి దూసుకెళ్లింది. ప్రత్యర్థికి ఎక్కడా అవకాశం ఇవ్వకుండా.. పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వరుస సెట్లలో మ్యాచ్ ని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో విజయంతో పతకానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది సింధు. 

తొలి రౌండ్లో సింధు 21-13 తో యమగూచిపై పూర్తి ఆధిపత్యాన్ని చెలాయిస్తూ మ్యాచ్ ను కైవసం చేసుకుంది. సింధు తన హైట్ అడ్వాంటేజ్ ని తీసుకోనివ్వకుండా యమగూచి సింధుకి స్మాషెస్ కొట్టే అవకాశం ఇవ్వకుండా సాధ్యమైనంత మేర నెట్ గేమ్ ఆడడానికే ప్రయత్నించింది. సింధు పూర్తి ప్రశాంతతతో ఈ మ్యాచ్ ను ఆడింది. అవుట్ బాల్స్ ని పర్ఫెక్ట్ గా జడ్జి చేసింది సింధు. అదును చిక్కినప్పుడల్లా బలమైన స్మాష్ లతో పాయింట్లను సాధించింది. 

యమగూచి తక్కువ ఎత్తు ఉండడం వల్ల లో లెవెల్ స్మాషెస్ ని రిటర్న్ చేయడంలో ఇబ్బంది పడింది. దాన్ని పూర్తిగా తనకు అనుకూలంగా వాడుకుంది సింధు. మిడ్ బ్రేక్ అప్పటికి సింధు నాలుగు పాయింట్ల లీడ్ లో ఉంది. వేరియేషన్స్ చూపెడుతూ, పవర్ ని జెనెరేట్ చేస్తూ ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. క్రాస్ కోర్ట్ షాట్స్ తో ప్రత్యర్థిని కోర్టు అంతా పరుగెత్తించింది. ఒక్కసారి మిడ్ గేమ్ బ్రేక్ తరువాత సింధు వెనక్కి తిరిగి చూసుకోలేదు. 21-13 తో పీవీ సింధు తొలి సెట్ ను కైవసం చేసుకుంది. 

తొలి రౌండ్లలో సాధించిన ఆధిక్యతతో సింధు ప్రత్యర్థిపై మరింత ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసి సింధు సఫలీకృతమైంది. యమగూచి అనవసర తప్పిదాలను చేసేలా సింధు ఫోర్స్ చేసింది. సింధు గేమ్ ని చూస్తున్నంత సేపు కూడా సింధు సూపర్బ్ ఫామ్ లో ఉన్నట్టు అనిపించింది. గతంలో సింధు నెట్ గేమ్ ఆడదానికి ఒకింత ఇబ్బంది పడేది. కానీ ఈ గేమ్ లో సింధు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా... పూర్తి కాన్ఫిడెన్స్ తో నెట్ గేమ్ ని ఆడింది. 6-11 స్కోర్ తో 5 పాయింట్ల లీడ్ తో సింధు మిడ్ గేమ్ బ్రేక్ లోకి వెళ్ళింది. 

ఇక మిడ్ గేమ్ బ్రేక్ తరువాత తిరిగివచ్చిన యమగూచి అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చింది. లాంగ్ ర్యాలీలు ఆడుతూ సింధు ని బాగా అలిసేలా చేసి పాయింట్లను సాధించింది యమగూచి. ఒకానొక స్టేజిలో 6 పాయింట్ల వెనుకంజలో ఉన్న యమగూచి... సింధుని దాటేసి వెళ్ళింది. కానీ చివర్లో మరోసారి దూసుకొచ్చిన సింధు రెండు గేమ్ పాయింట్స్ ని సేవ్ చేసి గేమ్ తో పాటుగా మ్యాచ్ ని కూడా కైవసం 

ఇక నిన్న సింధు మ్యాచ్ జరుగుతున్నప్పుడు సింధు కోచ్ సింధు పక్కన ఉండకుండా... యమగూచి ఆటను చూసేందుకు తను ఆడుతున్న కోర్టులో ప్రేక్షకుడిగా కూర్చున్నాడు. కూర్చోవడమే కాకుండా... అక్కడ నోట్స్ తాయారు చేసుకుంటూ యమగూచి బాలల్ని, బలహీనతల్ని క్షుణ్ణంగా పరిశీలించి నోట్స్ తాయారు చేసుకున్నాడు. 

దాని ఫలితము ఈరోజు మ్యాచ్ లో కనబడింది. సింధు పూర్తిగా యమగూచి ఆటను కాచి వడపోసినట్టు ఆడింది. ఏక్కడా కూడా ఎంతమాత్రం ఇబ్బంది లేకుండా రెండు వరుస సెట్లలో విజయం సాధించి మ్యాచ్ ను గెల్చుకుంది. 

click me!