Tokyo Olympics: సెమీస్ చేరిన భారత రోవర్లు అర్జున్ లాల్,అరవింద్ సింగ్

By team teluguFirst Published Jul 25, 2021, 8:24 AM IST
Highlights

భారత రోవర్లు అర్జున్ లాల్, అరవింద్ సింగ్ లు పురుషుల డబల్ స్కల్స్ లైట్ వెయిట్ కేటగిరీలో సెమీస్ కి చేరారు.

భారత రోవర్లు అర్జున్ లాల్, అరవింద్ సింగ్ లు పురుషుల డబల్ స్కల్స్ లైట్ వెయిట్ కేటగిరీలో సెమిస్ కి చేరారు. రిపచాజ్ రౌండ్ లో మూడవ స్థానంలో నిలవడంతో వారు సెమిస్ కి క్వాలిఫై అయ్యారు. తొలి మూడు స్థానాల్లో నిలిచినా వారికి మాత్రమే సెమిస్ కి అవకాశం దక్కుతుంది. మూడవ స్థానంలో నిలిచినా భారత రోవర్లు సెమిస్ కి అర్హత సాధించారు. 

సెమీఫైనల్స్ కి చేరుకోవడానికి రిపచాజ్ రౌండ్ రోవర్లకు రెండవ అవకాశాన్ని ఇస్తుంది. ఇక్కడ క్వాలిఫై అయినా రోవర్లు సెమీఫైనల్ A/B 1,2 లకు చేరుతారు. ఇందులో మొదటి మూడు స్థానాల్లో నిలిచినా వారు ఫైనల్ ఆ కి చేరుతారు. ఫైనల్ A మెడల్స్ కోసం జరుగుతుండగా, ఎవరు చేరుకుంటారో తేల్చేది ఫైనల్ B. 

భారత రోవర్లు సెమీఫైనల్ A /B 2లో ఉన్నారు. అర్జున్ లాల్ బో పొజిషన్ లో ఉండగా అరవింద్ సింగ్ స్ట్రోక్ పొజిషన్ లో ఉంది ఈ స్కల్స్ ఈవెంట్లో పోటీపడుతున్నారు.  మరికొద్ది సేపట్లో భారత సైలర్ విష్ణు శరవణన్ లేజర్ మెన్స్ సెయిలింగ్ కేటగిరీలో పోటీపడనున్నాడు. 

rowers Arjun Lal and Arvind Singh have qualified for the SEMI-FINAL of Men's Lightweight Double Sculls after finishing 3️⃣rd in the repechage round! 🚣🚣 | | pic.twitter.com/Sn6mX0SWnw

— #Tokyo2020 for India (@Tokyo2020hi)

ఇకపోతే భారత్ కి నేటి ఉదయం షూటింగ్ లో నిరాశ ఎదురయింది. 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో భారత్ తరుఫున మను బాకర్,యశస్విని దేశ్వాల్ నిరాశపరిచారు. ఫైనల్స్ లోకి దూసుకెళ్లలేకపోయారు. నిన్న షూటర్లు నిరాశపర్చిన తరువాత నేడు కూడా అదే తరహాలో మరోసారి నిరాశ ఎదురయింది. 

టాప్ 8లో నిలిచిన షూటర్లు మాత్రమే ఫైనల్స్ కి క్వాలిఫై అవనున్న నేపథ్యంలో భారత షూటర్లు మను,యశస్వినిలు 12,13 స్థానాల్లో నిలిచి తమ పోరాటాన్ని ముగించారు. ఇద్దరు ఓడినప్పటికీ... తమ పూర్తి స్థాయి ప్రదర్శనను చేసి ఆకట్టుకున్నారు. 

టోక్యో ఒలింపిక్స్ లో ఆరవ సీడ్ గా బరిలోకి దిగిన సింధు తన తొలి మ్యాచులో విజయం సాధించింది. ఇజ్రాయెల్  కి చెందిన పులికాపువా తో తలపడిన మ్యాచులో ఆది నుంచి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. సింధు ఆటకు ఎక్కడ కూడా ఇజ్రాయెల్ ప్లేయర్ సరైన పోటీని ఇవ్వలేకపోయింది. సింధు పెద్దగా కష్టపడకుండానే సునాయాస విజయం సాధించింది. 

వరుస సెట్లలో విజయం సాధించింది 21-7 తో తొలి సెట్ ను కైవసం చేసుకున్న సింధు 21-10 తో రెండవ సెట్ ను కైవసం చేసుకోవడంతోపాటుగా మ్యాచును కూడా గెలిచింది.

click me!