Tokyo Olympics: తొలి గేమ్ లో విజయం సాధించిన పీవీ సింధు

By team teluguFirst Published Jul 25, 2021, 7:45 AM IST
Highlights

టోక్యో ఒలింపిక్స్ లో ఆరవ సీడ్ గా బరిలోకి దిగిన సింధు తన తొలి మ్యాచులో విజయం సాధించింది. 

టోక్యో ఒలింపిక్స్ లో ఆరవ సీడ్ గా బరిలోకి దిగిన సింధు తన తొలి మ్యాచులో విజయం సాధించింది. ఇజ్రాయెల్  కి చెందిన పులికాపువా తో తలపడిన మ్యాచులో ఆది నుంచి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. సింధు ఆటకు ఎక్కడ కూడా ఇజ్రాయెల్ ప్లేయర్ సరైన పోటీని ఇవ్వలేకపోయింది. సింధు పెద్దగా కష్టపడకుండానే సునాయాస విజయం సాధించింది. 

వరుస సెట్లలో విజయం సాధించింది 21-7 తో తొలి సెట్ ను కైవసం చేసుకున్న సింధు 21-10 తో రెండవ సెట్ ను కైవసం చేసుకోవడంతోపాటుగా మ్యాచును కూడా గెలిచింది.  

మ్యాచ్ ఆద్యంతం కూడా సింధు పూర్తిగా ఎటువంటి క్లిష్టమైన షాట్స్ ఆడకుండానే మ్యాచ్ ను గెలిచింది. వన్ వే ట్రాఫిక్ లా మ్యాచ్ సాగుతుందని కామెంటేటర్లు అన్నారంటే మ్యాచ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. నెట్ వద్దనే షాట్స్ ఆడుతూ ఇజ్రాయెలీ ప్లేయర్ కి ఎక్కడా అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ ను కైవసం చేసుకుంది. 

మ్యాచ్ ఆద్యంతం కూడా సింధు కేవలం ఒక వార్మ్ అప్ కోసం ఆడినట్టు చాలా సింపుల్ గా ఆడుతూ గేమ్ ని కైవసం చేసుకుంది. సింధు కోర్ట్ ను ఓన్ చేసుకొని ఆడిన విధానం నిజంగా సింధు కాన్ఫిడెన్స్ ని బూస్ట్ చేస్తుందనడంలో ఎటువంటి డౌట్ లేదు. 

సింధు గ్రూప్ స్టేజి లో తన తదుపరి మ్యాచ్ ని హాంకాంగ్ ప్లేయర్ చాంగ్ తో తలపడనుంది. ఇప్పటివరకు ఆ ప్లేయర్ తో సింధు తలపడ్డ 5 మ్యాచుల్లోనూ విజయం సాధించింది. 2017లో సదరు ప్లేయర్ తో చివరి మ్యాచ్ ఆడింది. 

ఇకపోతే రెండవ రోజు ఆరంభంలోనే మహిళా షూటర్లు నిరాశపరిచారు.  టోక్యోలో భారత్ తన రెండవ రోజు వేటను షూటింగ్ తో ఆరంభించింది. 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో భారత్ తరుఫున మను బాకర్,యశస్విని దేశ్వాల్ నిరాశపరిచారు. ఫైనల్స్ లోకి దూసుకెళ్లలేకపోయారు. నిన్న షూటర్లు నిరాశపర్చిన తరువాత నేడు కూడా అదే తరహాలో మరోసారి నిరాశ ఎదురయింది. 

టాప్ 8లో నిలిచిన షూటర్లు మాత్రమే ఫైనల్స్ కి క్వాలిఫై అవనున్న నేపథ్యంలో భారత షూటర్లు మను,యశస్వినిలు 12,13 స్థానాల్లో నిలిచి తమ పోరాటాన్ని ముగించారు. ఇద్దరు ఓడినప్పటికీ... తమ పూర్తి స్థాయి ప్రదర్శనను చేసి ఆకట్టుకున్నారు. 

click me!