టోక్యో ఒలింపిక్స్: బాక్సర్ సతీశ్ కుమార్‌కి తీవ్ర గాయాలు... క్వార్టర్ ఫైనల్స్‌లో...

By Chinthakindhi RamuFirst Published Jul 31, 2021, 4:07 PM IST
Highlights

మెన్స్ బాక్సింగ్‌లో క్వార్టర్ ఫైనల్‌లోకి వెళ్లిన ఏకైక భారత మేల్ బాక్సర్ సతీశ్ కుమార్...

తొలి రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో సతీశ్ కుమార్‌కి తీవ్ర గాయాలు...

టోక్యో ఒలింపిక్స్‌లో పతకం కోసం ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది నిజంగా చేదు వార్తే. మెన్స్ బాక్సింగ్‌లో క్వార్టర్ ఫైనల్‌లోకి వెళ్లిన ఏకైక మేల్ బాక్సర్ సతీశ్ కుమార్, తీవ్ర గాయాలతో బాధపడుతున్నాడు. 

91 కేజీల హెవీ వెయిట్ విభాగంలో పోటీపడిన సతీశ్ కుమార్, తొలి రౌండ్‌లో జమైకా బాక్సర్‌పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌కి దూసుకెళ్లాడు. ఒలింపిక్స్‌లో హెవీ వెయిట్ కేటగిరీలో పోటీపడిన మొట్టమొదటి భారత బాక్సర్ కూడా సతీశ్ కుమారే.

తొలి రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో సతీశ్ కుమార్‌కి తీవ్ర గాయాలు అయ్యాయని, క్వార్టర్ ఫైనల్‌లో ఆడడం అనుమానంగా మారినట్టు సమాచారం. ‘జమైనా బాక్సర్ రిచర్డో బ్రౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో సతీశ్ కుమార్ గాయపడ్డాడు. అతని కుడి కన్ను పైన, అలాగే గడ్డం దగ్గర రెండు చోట్ల చర్మం చిట్లింది.

ఈ గాయాలు తగ్గడానికి చాలా సమయం పడుతుంది. క్వార్టర్‌ ఫైనల్స్‌లో పోటీపడేందుకు అతను సిద్ధంగా లేకపోవచ్చు...’ అంటూ కామెంట్ చేశాడు బాక్సింగ్ కోచ్... అయితే క్వార్టర్ ఫైనల్స్‌లో పోటీ పడేందుకు సతీశ్ కుమార్ సిద్ధమవుతున్నాడని, ఉజకిస్తాన్ బాక్సర్‌తో రింగ్‌లో పోరాడేందుకే నిర్ణయించుకున్నాడని తెలిపాడు బాక్సింగ్ జాతీయ కోచ్... 

click me!