టోక్యో ఒలింపిక్స్: ఫైనల్స్‌కి కమల్‌ప్రీత్ కౌర్... నిరాశపరిచిన సీమా పూనియా...

By Chinthakindhi RamuFirst Published Jul 31, 2021, 8:41 AM IST
Highlights

మూడో ప్రయత్నంలో 64.00 మీటర్లు విసిరి ఆటోమెటిక్‌ క్వాలిఫికేషన్ సాధించిన కమల్‌ప్రీత్ కౌర్...

గ్రూప్ బీలో రెండో స్థానంలో నిలిచిన కమల్‌ప్రీత్ కౌర్... క్వాలిఫికేషన్ రౌండ్ నుంచే సీమా పూనియా అవుట్...

టోక్యో ఒలింపిక్స్‌లో స్టార్ అథ్లెట్ల ఫెయిల్యూర్ పరంపరను కొనసాగిస్తూ సీమా పూనియా, డిస్కస్ త్రో ఈవెంట్‌లో నిరాశపరిచింది. మొదటి ప్రయత్నంలో ఫాల్‌ చేసిన సీమా పూనియా, రెండో ప్రయత్నంలో 60.57 మీటర్ల దూరం విసిరింది. మూడో ప్రయత్నంలో 58.93 మత్రమే రావడంతో గ్రూప్ ఏలో ఆరో స్థానంలో నిలిచింది. 

గ్రూప్ బీలో కమల్‌ప్రీత్ కౌర్ అద్భుత ప్రదర్శన ఇచ్చి ఫైనల్స్‌కి దూసుకెళ్లింది తొలి ప్రయత్నంలో 60.29, రెండో ప్రయత్నంలో 63.97, మూడో ప్రయత్నంలో 64.00 విసిరి ఆటోమెటిక్‌ క్వాలిఫికేషన్ సాధించింది. గ్రూప్ బీలో రెండో స్థానంలో నిలిచిన కమల్‌ప్రీత్ కౌర్, ఫైనల్స్‌కి దూసుకెళ్లగా... సీమా పూనియా క్వాలిఫికేషన్ రౌండ్ నుంచే తప్పుకుంది.

టోక్యో ఒలింపిక్స్‌లో శనివారం ఆరంభంలో భారత్‌కి ఆశించని ఫలితాలు దక్కలేదు. ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో భారత ఆర్చర్ అతానుదాస్, జపాన్‌ అథ్లెట్ టకహరు ఫురుకవాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలయ్యాడు. 

బాక్సింగ్‌లో 52 కేజీల విభాగంలో టాప్ బాక్సర్ అమిత్ పంగల్ రెండో రౌండ్‌లోనే ఓడి, తీవ్రంగా నిరాశపరిచాడు. మొదటి రౌండ్‌లో బై లభించడంతో నేరుగా రెండో రౌండ్ చేరిన అమిత్, కొలంబియాకు చెందిన హెర్నీ మార్టినెజ్‌తో జరిగిన మ్యాచ్‌లో 1-4 తేడాతో ఓడి, టోర్నీ నుంచి నిష్కమించాడు.

click me!