వరల్డ్ నెం.1 నోవాక్ జొకోవిచ్‌కి షాక్... సింగిల్స్‌లో ఓటమి, డబుల్స్ నుంచి వాకోవర్...

By Chinthakindhi Ramu  |  First Published Jul 31, 2021, 3:06 PM IST

ఒలింపిక్ పతకం లేకుండానే టోక్యో నుంచి వెనుదిరిగిన వరల్డ్ నెం.1 నోవాక్ జోకోవిచ్...

రెండు గంటల 47 నిమిషాల పాటు సాగిన సుదీర్ఘ మ్యాచ్‌లో అలసిపోయి, అసహనానికి గురైన జొకోవిచ్... 

మొట్టమొదటి ఒలింపిక్ మెడల్ సాధించిన కారెన్నో బూస్ట...


వరల్డ్ నెం.1 టెన్నిస్ స్టార్ నోవాక్ జోకోవిచ్‌కి టోక్యో ఒలింపిక్స్‌లో ఊహించని షాక్ తగిలింది. వింబుల్డన్ 2021 టైటిల్ గెలిచి, జోరు మీదున్న ఈ సెర్బియా టెన్నిస్ స్టార్... ఒలింపిక్ పతకం లేకుండానే టోక్యో నుంచి వెనుదిరిగాడు.

సెమీ ఫైనల్స్‌లో చేతుల్లో ఓడిన నోవాక్ జొకోవిచ్, కారెన్నో బూస్టతో జరిగిన కాంస్య పతక మ్యాచ్‌లోనూ పోరాడి ఓడాడు. రెండు గంటల 47 నిమిషాల పాటు సాగిన ఈ సుదీర్ఘ మ్యాచ్‌లో అలసిపోయి, అసహనానికి గురైనట్టు స్పష్టంగా కనిపించిన జొకోవిచ్... 4-6, 7-6 (8-6), 3-6 తేడాతో ఓటమి పాలయ్యాడు.

Latest Videos

undefined

తొలి సెట్‌ కోల్పోయినా, రెండో సెట్‌లో అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చిన జొకోవిచ్, మూడో సెట్‌లో పూర్తిగా అలిసిపోయినట్టు కనిపించాడు. 1-5 తేడాతో మ్యాచ్‌పై పట్టు సాధించిన బూస్ట, మ్యాచ్‌ను ఈజీగా ముగించేలా కనిపించాడు. అయితే ఆ తర్వాత వరుసగా రెండు గేమ్ పాయింట్లు సాధించిన జొకోవిచ్... 3-5 తేడాతో వ్యత్యాసాన్ని తగ్గించాడు. 

ఆఖరి గేమ్ పాయింట్ కోసం దాదాపు 15 నిమిషాలకు పైగా పోరాడిన బూస్టకు ఇది మొట్టమొదటి ఒలింపిక్ మెడల్. ఆరో సీడ్ బూస్ట, ఒలింపిక్ కాంస్య పతకం సాధించాడు... జోకోవిచ్‌ను సెమీస్‌లో ఓడిన జర్మనీ ప్లేయర్ అలెగ్జాండర్ జెరేవ్, బూస్టను ఓడించిన రష్యా ప్లేయర్ కచానోవ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. 

వింబుల్డన్ 2021 టైటిల్‌ను గెలిచి, టెన్నిస్ లెజెండ్స్ రఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్‌ల 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ రికార్డును సమం చేసిన నోవాక్ జొకోవిచ్... ఒలింపిక్ గోల్డ్ మెడల్ ఆశను మాత్రం నెరవేర్చుకోలేకపోయాడు. ఒలింపిక్స్‌లో 2008 బీజింగ్‌లో గెలిచిన కాంస్య పతకమే జొకోవిచ్‌కి దక్కిన ఏకైక మెడల్...

అంతకుముందు మిక్స్‌డ్ డబుల్స్‌ సెమీస్‌లోనూ ఓడిన జోకోవిచ్, నైనా స్టోకోవిక్ జోడీ, నేడు కాంస్య పతక మ్యాచ్‌లో పోటీపడాల్సి ఉంది. అయితే సింగిల్స్ మ్యాచ్‌తో అలసిపోయిన జోకోవిచ్ ఈ పోటీ నుంచి తప్పుకోవడంతో ఆస్ట్రేలియా జోడీ జాన్ పీర్స్, అస్‌లీ బార్టీకి కాంస్య పతకం దక్కింది. 

click me!