టోక్యో ఒలింపిక్స్: క్వార్టర్ ఫైనల్స్‌లో పూజా రాణి ఓటమి... పతకానికి అడుగు దూరంలో...

By Chinthakindhi Ramu  |  First Published Jul 31, 2021, 4:20 PM IST

క్వార్టర్ ఫైనల్స్‌లో చైనాకు చెందిన లీ కియాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 0-5 తేడాతో ఓడిన పూజా రాణి...


టోక్యో ఒలింపిక్స్‌లో శనివారం భారతబాక్సర్లకు కలిసి రావడం లేదు. భారత స్టార్ బాక్సర్ అమిత్ పంగల్ తొలి మ్యాచ్‌లోనే ఓటమి చెందగా, ఒలింపిక్ మెడల్ తెస్తుందని ఆశపడిన పూజారాణి క్వార్టర్ ఫైనల్స్‌లో ఓడిపోయింది. 

69 కేజీల మిడిల్ వెయిట్ విభాగంలో జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో చైనాకు చెందిన లీ కియాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 0-5 తేడాతో ఓడింది పూజా రాణి. అంతకుముందు మెన్స్ బాక్సింగ్‌లో 52 కేజీల విభాగంలో టాప్ బాక్సర్ అమిత్ పంగల్ రెండో రౌండ్‌లోనే ఓడి, తీవ్రంగా నిరాశపరిచాడు.

Latest Videos

undefined

మొదటి రౌండ్‌లో బై లభించడంతో నేరుగా రెండో రౌండ్ చేరిన అమిత్, కొలంబియాకు చెందిన హెర్నీ మార్టినెజ్‌తో జరిగిన మ్యాచ్‌లో 1-4 తేడాతో ఓడి, టోర్నీ నుంచి నిష్కమించాడు.

గ్రూప్ బీలో కమల్‌ప్రీత్ కౌర్ అద్భుత ప్రదర్శన ఇచ్చి ఫైనల్స్‌కి దూసుకెళ్లింది. తొలి ప్రయత్నంలో 60.29, రెండో ప్రయత్నంలో 63.97, మూడో ప్రయత్నంలో 64.00 విసిరి ఆటోమెటిక్‌ క్వాలిఫికేషన్ సాధించింది. గ్రూప్ బీలో రెండో స్థానంలో నిలిచిన కమల్‌ప్రీత్ కౌర్, ఫైనల్స్‌కి దూసుకెళ్లగా... సీమా పూనియా క్వాలిఫికేషన్ రౌండ్ నుంచే తప్పుకుంది.

మెన్స్ సింగిల్స్ ఆర్చరీ ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో భారత ఆర్చర్ అతానుదాస్, జపాన్‌ అథ్లెట్ టకహరు ఫురుకవాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలయ్యాడు. 

click me!