కరోనా రూల్స్ బ్రేక్.. ముగ్గురు శ్రీలంక క్రికెటర్లపై నిషేధం

By telugu news teamFirst Published Jul 31, 2021, 8:30 AM IST
Highlights

ఈ ముగ్గురూ బయోబబుల్ రూల్స్‌ని బ్రేక్ చేశారని, ఆ కారణంగానే వీరిపై చర్యలు తీసుకుంటున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు వెల్లడించింది.
 

కరోనా రూల్స్ పట్టించుకోకుండా.. వ్యవహరించిన ముగ్గురు శ్రీలంక క్రికెటర్లపై వేటు పడింది. శ్రీలకం క్రికెట్ కౌన్సిల్.. వారిపై ఏడాదిపాటు నిషేధం విధించింది. ధనుష్క గుణతిలక, కుశాల్ మెండిస్, నిరోషన్ డిక్వెల్లాల పై ఏడాదిపాటు నిషేధం విధిస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. అలాగే ఆరు నెలల పాటు జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల్లో ఆడటంపైనా నిషేధం విధించింది. ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా ఈ ముగ్గురూ బయోబబుల్ రూల్స్‌ని బ్రేక్ చేశారని, ఆ కారణంగానే వీరిపై చర్యలు తీసుకుంటున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు వెల్లడించింది.

ఈ ముగ్గురూ ఇంగ్లండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌ సందర్భంగా బయో బబుల్‌ను ఉల్లంఘించారనే కారణంతో ఇంటికి పంపించారు. అంతేకాదు.. ఈ నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో 10 మిలియన్లు(శ్రీలంక రూపాయలు) జరిమానా విధించారు. కాగా, ఈ ముగ్గురిపై నిషేధ వేటు పడుతుందని ఇప్పటికే వార్తలు రాగా.. తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఈ వేటు కారణంగా.. ఈ ముగ్గురు క్రికెటర్లు టీ20 ప్రపంచ కప్‌కు దూరం కానున్నారు. ఇక 2022లో ఆస్ట్రేలియాలో జరిగే తదుపరి టీ20 ప్రపంచ కప్‌కు ముందు టీమ్‌లో జాయిన్ అవుతారు.

click me!