Tokyo Olympics :తొలి మ్యాచులోనే భారత స్టార్ బాక్సర్ అమిత్ పంగల్ ఓటమి

By team teluguFirst Published Jul 31, 2021, 8:17 AM IST
Highlights

బాక్సింగ్ ప్రీ క్వార్టర్స్ లో భారత స్టార్ బాక్సర్, వరల్డ్ నెంబర్ 1 అమిత్ పంగల్ తొలి రౌండ్లోనే ఓటమి చెందాడు. భారత్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ బాక్సర్ తొలి మ్యాచ్ లోనే కొలంబియన్ బాక్సర్ మార్టినెజ్ చేతిలో 1-4 తేడాతో ఓటమి చెందాడు.

బాక్సింగ్ ప్రీ క్వార్టర్స్ లో భారత స్టార్ బాక్సర్, వరల్డ్ నెంబర్ 1 అమిత్ పంగల్ తొలి రౌండ్లోనే ఓటమి చెందాడు. భారత్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ బాక్సర్ తొలి మ్యాచ్ లోనే కొలంబియన్ బాక్సర్ మార్టినెజ్ చేతిలో 1-4 తేడాతో ఓటమి చెందాడు. 

తొలి రౌండ్లో అమిత్ తన గార్డ్ ని కాపాడుకుంటూ... ప్రత్యర్థి బాక్సర్ పై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. 2016 రియోలో వెండిపతకం నెగ్గిన ఈ కొలంబియన్ బాక్సర్ పై అమిత్ తన పూర్తి ఆధిపత్యాన్ని చెలాయిస్తూ... తొలి రౌండ్ ని కైవసం చేసుకున్నాడు. 

రెండవ రౌండ్లో అమిత్ పై కొలంబియన్ బాక్సర్ విరుచుకుపడ్డాడు. లెఫ్ట్ హ్యాండ్ తో వరుస పంచెస్ ని అమిత్ పై ల్యాండ్ చేసాడు. ఈ రౌండ్ లో మార్టినెజ్ కి పంచెస్ రిటర్న్ చేయడంలో విఫలమయ్యాడు అమిత్. అమిత్ గార్డ్ ని ఛేదిస్తూ మార్టినెజ్ పిడిగుద్దులు ధాటికి అమిత్ రెండవ రౌండ్ ను కోల్పోయాడు. 

1-1 తో చెరొక రౌండ్ ని గెలిచి ఉన్న ఈ బాక్సర్లు చివరి రౌండ్ ని ని ఎలాగైనా గెలిచి మ్యాచ్ ను కైవసం చేసుకోవాలని ప్రయత్నించారు. ఈ కీలక లాస్ట్ రౌండ్లో అమిత్ ఒకింత డిఫెన్సివ్ గా కనబడ్డాడు. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్న కొలంబియన్ బాక్సర్ కాంబినేషన్ పంచెస్ తో విరుచుకుపడ్డాడు. ఒక నిమిషం తరువాత తేరుకుని రిటర్న్ పంచులు అమిత్ ల్యాండ్ చేసినప్పటికీ... ఒత్తిడి వల్ల పూర్తిస్థాయి ఆటతీరును ప్రదర్శించలేక అమిత్ టోక్యో పోరు ముగిసింది. 

ఇక నిన్న భారత బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ భారత్ కు టోక్యోలో మరో పతకాన్ని, బాక్సింగ్ లో తొలి పతకాన్ని ఖాయం చేసింది. నేడు జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో లవ్లీనా తన లవ్లీ పంచులతో తైపీ బాక్సర్ చెన్ పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ సెమిస్ లోకి దూసుకెళ్లి భారత్ కు కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసింది. 

తొలి రౌండ్ నుంచి కూడా ఎక్కడా తడబడకుండా మ్యాచులో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తొలి రెండు రౌండ్లను గెలిచినా లవ్లీనా పై మూఢవ రౌండ్ లో తైపీ బాక్సర్ ఎదురుదాడికి దిగినప్పటికీ.. లవ్లీనా తన ఆధిక్యతను నిలుపుకుంటూ వచ్చి క్వార్టర్స్ లో విజయం సాధించి సెమిస్ లోకి దూసుకెళ్లడం ద్వారా కనీసం కాంస్యాన్ని ఖాయం చేసింది

ఇక నేడు మరో భారత బాక్సర్ పూజ రాణి క్వార్టర్ ఫైనల్స్ లో తలపడనుంది. ఈ మ్యాచులో గనుక పూజారిని గెలిస్తే భారత్ కి మరో పతకం ఖాయమైనట్టే..!

click me!