48 కేజీల వుమెన్ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మీరాభాయి ఛానుకి రజతం...
21 ఏళ్ల తర్వాత వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కి ఒలింపిక్ మెడల్...
టోక్యో ఒలింపిక్స్‌లో భారత వెయిట్ లిఫ్టర్ మీరాభాయ్ ఛాను మంచి పర్ఫామెన్స్ ఇచ్చింది. 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో స్నాచ్‌లో మొదటి ప్రయత్నంలో 84 కేజీలను ఎత్తిన మీరాభాయ్, రెండో ప్రయత్నంలో 87కేజీలు ఎత్తి... తొలి హాఫ్‌లో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. చైనా వెయిల్ లిఫ్టర్ హో జీహుయ్ 94 కేజీలు లిప్ట్ చేసి అగ్రస్థానంలో నిలిచింది.
తొలి ప్రయత్నంలో 110 కేజీలు ఎత్తిన మీరాభాయ్ ఛాను, రెండో ప్రయత్నంలో 115 కేజీలను లిఫ్ట్ చేసి అదరగొట్టింది. మూడో ప్రయత్నంలో 117 కేజీలను ఎత్తేందుకు చేసేందుకు ప్రయత్నం విఫలమైంది. చైనా వెయిట్ లిఫ్టర్ హో జీహుయ్ టాప్‌లో నిలిచి, స్వర్ణం సాధించింది.
undefined
2000 ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన తెలుగు అథ్లెట్ కరణం మల్లీశ్వరి తర్వాత వెయిట్ లిఫ్టింగ్‌లో మెడల్ సాధించిన భారత వెయిట్ లిఫ్టర్‌గా నిలిచింది మీరాభాయి ఛాను... వెయిట్ లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించిన మొట్టమొదటి భారత మహిళా వెయిట్ లిఫ్టర్‌గా సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది మీరాభాయి ఛాను...