టోక్యో ఒలింపిక్స్: తొలి రౌండ్‌లో ఓడిన బాక్సర్ మనీశ్ కౌషిక్...

Published : Jul 25, 2021, 03:49 PM ISTUpdated : Jul 25, 2021, 05:17 PM IST
టోక్యో ఒలింపిక్స్: తొలి రౌండ్‌లో ఓడిన బాక్సర్ మనీశ్ కౌషిక్...

సారాంశం

63 కేజీల విభాగంలో గ్రేట్ బ్రిటన్‌కి చెందిన లూక్ మెక్‌కార్మక్‌తో జరిగిన మ్యాచ్‌లో 1-4 తేడాతో ఓడిన మనీశ్ కౌషిక్... వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకం సాధించిన మనీశ్ కౌషిక్‌పై భారీ ఆశలు...

టోక్యో ఒలింపిక్స్‌లో భారత మెన్స్ బాక్సర్ మనీశ్ కౌషిక్, తొలి రౌండ్‌లోనే ఓడి ఇంటిదారి పట్టాడు. 63 కేజీల విభాగంలో గ్రేట్ బ్రిటన్‌కి చెందిన లూక్ మెక్‌కార్మక్‌తో జరిగిన మ్యాచ్‌లో 1-4 తేడాతో ఓడిన మనీశ్ కౌషిక్, నిరాశగా వెనుదిరిగాడు.

తొలి రౌండ్‌లో ఓడినా, రెండో రౌండ్‌లో పుంజుకున్న మనీశ్ కౌషిక్, మూడో రౌండ్‌లో తేలిపోవడంతో ఓటమి ఖరారైంది. వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకం సాధించిన మనీశ్ కౌషిక్‌పై టోక్యో ఒలింపిక్స్‌లో భారీ అంచనాలు ఉండేవి.

భారత సీనియర్ బాక్సర్ మేరీకోమ్‌, టోక్యో ఒలింపిక్స్‌లో శుభారంభం దక్కించుకుంది. 51 కేజీల విభాగంలో జరిగిన తొలి రౌండ్‌లో డొమినిక్ రిప్లబిక్ బాక్సర్ మిగులినా హర్నాండేజ్ గ్రేసియాను 4-1 తేడాతో ఓడించిన మేరీకోమ్, రౌండ్ 16లోకి అడుగుపెట్టింది. 

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !