టోక్యో ఒలింపిక్స్: తొలి రౌండ్‌లోనే ఓడిన రెజ్లర్ సోనమ్ మాలిక్...

By Chinthakindhi Ramu  |  First Published Aug 3, 2021, 9:09 AM IST

మంగోలియా రెజ్లర్ బోలో‌తుయా కురెల్‌కుతో జరిగిన మ్యాచ్‌లో 2-2 తేడాతో ఓడిన సోనమ్ మాలిక్... 


టోక్యో ఒలింపిక్స్‌లో భారత వుమెన్ రెజ్లర్ సోనమ్ మాలిక్ తొలి రౌండ్‌లోనే ఓడింది. 62 కేజీల విభాగంలో మంగోలియా రెజ్లర్ బోలో‌తుయా కురెల్‌కుతో జరిగిన మ్యాచ్‌లో 2-2 తేడాతో ఓడింది సోనమ్ మాలిక్. ప్రత్యర్థితో తప్పులు చేయించి, వరుసగా ఒక్కో పాయింట్‌తో 2 పాయింట్లు సాధించింది సోనమ్.

అయితే ఆఖరి 30 సెకన్లలో సోనమ్‌పై పట్టు సాధించిన బోలోతుయా, ఒకేపట్టుతో 2 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. వరల్డ్ క్యాడెట్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన 19 ఏళ్ల సోనమ్ మాలిక్‌కి ఇదే తొలి ఒలింపిక్స్. 

Latest Videos

undefined

అంతకుముందు 41 ఏళ్ల తర్వాత టోక్యో ఒలింపిక్స్‌లో సెమీస్ చేరిన భారత పురుషుల హాకీ జట్టు, ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయింది. బెల్జియంతో జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత మెన్స్ హాకీ టీం పోరాడి ఓడింది.
 
బెల్జియం అటాకింగ్‌ను అడ్డుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసిన టీమిండియా, అనవసర తప్పిదాలు చేసి ప్రత్యర్థికి వరుసగా పెనాల్టీ కార్నర్స్ అందించింది. బెల్జియం సాధించిన గోల్స్ అన్నీ పెనాల్టీ కార్నర్ ద్వారా వచ్చినవే కావడం విశేషం.  

మహిళల జావెలిన్ త్రో ఈవెంట్‌లో భారత అథ్లెట్ అన్నూ రాణి నిరాశపరిచింది. ఫైనల్‌కి అర్హత సాధించాలంటే 60 మీటర్ల దూరం విసరాల్సిన దశలో అన్నూ రాణి అత్యుత్తమంగా 54.04 మీటర్లు మాత్రమే విసిరి 14వ స్థానంలో నిలిచింది.  

click me!