టోక్యో ఒలింపిక్స్: ఫైనల్స్‌లో నిరాశపరిచిన కమల్‌ప్రీత్ కౌర్... ఆరో స్థానంలో నిలిచి...

By Chinthakindhi Ramu  |  First Published Aug 2, 2021, 6:44 PM IST

డిస్కస్ త్రో పైనల్స్‌లో ఆరో స్థానంలో నిలిచిన కమల్‌ప్రీత్ కౌర్...


కమల్‌ప్రీత్ కౌర్ పోరాటం ముగిసింది. ఫైనల్స్‌లో మొదటి రౌండ్‌లో అత్యుత్తమంగా 63.70 మీటర్ల దూరం విసిరిన కమల్‌ప్రీత్ కౌర్, మెడల్ రౌండ్‌లో పతకం సాధించాలంటే కనీసం 67 మీటర్ల దూరం విసరాల్సిన దశలో ఆమె విసిరిన ఆఖరి త్రో వైడ్‌గా వెళ్లింది. 

వర్షం కారణంగా అంతరాయం కలిగిన డిస్కస్ త్రో ఫైనల్స్‌లో 68.98 మీటర్ల దూరం విసిరిన అమెరికా అథ్లెట్ అల్‌మన్ వలరీ స్వర్ణం సాధించగా, జర్మనీ అథ్లెట్ పుడెన్‌ క్రిస్టిన్ రజతం, క్యూబాకి చెందిన అథ్లెట్ పెరెజ్ యైమ్ కాంస్యం గెలిచారు.

Latest Videos

undefined

టోక్యో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ మరో సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది. ఈక్వెస్ట్రైయిన్ ఈవెంట్‌లో తొలిసారిగా బరిలో దిగిన భారత అథ్లెట్ ఫౌద్ మీర్జా...  ఈక్వెస్ట్రైయిన్ జంపింగ్ ఈవెంట్‌లో ఫైనల్‌కి అర్హత సాధించాడు.

తన గుర్రం సినియర్ మెరికాట్‌తో కలిసి ఈవెంట్‌లో పాల్గొన్న మీర్జా, వ్యక్తిగత జంపింగ్ క్వాలిఫైయర్‌లో 76: 14 సెకన్లలో జంపింగ్‌ను పూర్తి చేశాడు. 8 పెనాల్టీ పాయింట్లతో మొత్తంగా 25వ స్థానంలో నిలిచిన మీర్జా... ఫైనల్‌కి అర్హత సాధించాడు... 

అంతకుముందు వుమెన్స్ హాకీలో భారత జట్టు, ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌లోకి ప్రవేశించింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత షూటర్లు తీవ్రంగా నిరాశపరిచారు. 50 మీటర్ల రైఫిల్ 3పీ ఈవెంట్‌లో పోటీపడిన ఐశ్వరీ ప్రతాప్ తోమర్, సంజీవ్ రాజ్‌పుత్ 21వ, 32వ స్థానంలో నిలిచి ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయారు. 

click me!