గోపిచంద్ అభినందించారు, కానీ సైనా చేయలేదు: పీవీ సింధు

By narsimha lodeFirst Published Aug 2, 2021, 7:18 PM IST
Highlights

తన తొలి గురువు పుల్లెల గోపిచంద్  నుండి అభినందనలు అందాయని కానీ తన సీనియర్ సైనా నుండి ఎలాంటి  గ్రీటింగ్స్ రాలేదని టోక్యో ఒలంపిక్స్ లో విజయం సాధించిన స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు చెప్పారు.

అమరావతి: తన తొలి గురువు పుల్లెల గోపిచంద్ నుండి  అభినందనలు వచ్చాయని, కానీ తన సీనియర్ సైనా నెహ్వాల్ నుండి ఎలాంటి సందేశం రాలేదని  భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు చెప్పారు.టోక్యో ఒలంపిక్స్‌లో విజయం సాధించిన తర్వాత ఆమె  సోమవారం నాడు మీడియాతో మాట్లాడారు. తనకు పలువురి నుండి అభినందనలు వచ్చాయన్నారు. పుల్లెల గోపిచంద్  కూడ అభినందించారని ఆమె గుర్తు చేసుకొన్నారు. కానీ తన సీనియర్ సైనా నుండి ఎలాంటి సందేశం రాలేదన్నారు. సైనా తాను ఎక్కువగా మాట్లాడుకోబోమని ఆమె వివరించింది.

చైనా క్రీడాకారిణి బింగ్జియావోతో  పోరులో   సింధు విజయం సాధించింది. దీంతో ఆమె ఒలంపిక్స్ లో రెండు పతకాలు సాధించిన రెండో భారత క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది.పీవీ సింధుకు  రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోడీ , తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ, క్రీడాకారులు అభినందించారు. 

గత ఏడాది కరోనా సమయంలో  లండన్ లో  ఆమె ప్రత్యేక శిక్షణ తీసుకొంది. పుల్లెల గోపచంద్ తో పీవీ సింధుకు పొసగడం లేదనే ప్రచారం సాగింది. లండన్ నుండి తిరిగి వచ్చిన తర్వాత  గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో సింధు సాధన చేసింది. న్యూట్రిషియన్ ప్రోగ్రామ్ కోసమే తాను లండన్ వెళ్లి సాధన చేసినట్టుగా పీవీ సింధు ప్రకటించింది.

 

click me!