వరల్డ్ నెం.1 ఇండోనేషియా జోడి జిడెన్ మార్కస్, సుకముల్జో కెవిన్‌తో వరుస సెట్లలో 13-21, 12-21 తేడాతో ఓడిన సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి...
తర్వాతి మ్యాచ్‌లో బ్రిటీష్ జోడితో మ్యాచ్ ఆడనున్న సాత్రిక్, చిరాగ్ శెట్టి... ఆ మ్యాచ్‌లో గెలిస్తే క్వార్టర్ ఫైనల్‌కి అర్హత...
టోక్యో ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ మెన్స్ డబుల్స్‌లో వరల్డ్ నెం.1 ఇండోనేషియా జోడి జిడెన్ మార్కస్, సుకముల్జో కెవిన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జోడి సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి వరుస సెట్లలో 13-21, 12-21 తేడాతో ఓడింది.
తొలి సెట్‌ను 6-6 సమం చేసిన భారత జోడి, ఆ తర్వాత ఇండోనేషియా జోడి జోరు ముందు నిలవలేకపోయింది. రెండో సెట్లో 3-6 తేడాతో మూడు పాయింట్ల ఆధిక్యం సాధించిన భారత జోడి, ఆ తర్వాత వరుస పాయింట్లు అందించి మ్యాచ్‌ను కోల్పోయింది.
రెండో రౌండ్లో ఓడినా భారత జట్టుకి ఇంకా నాకౌట్స్‌కి చేరేందుకు అవకాశం ఉంది. తర్వాతి మ్యాచ్‌లో బ్రిటీష్ జోడితో మ్యాచ్ ఆడనున్న సాత్రిక్, చిరాగ్ శెట్టి, ఆ మ్యాచ్‌లో గెలిస్తే క్వార్టర్ ఫైనల్‌కి అర్హత సాధిస్తారు.