టోక్యో ఒలింపిక్స్‌ను వీడని కరోనా భూతం... కొత్తగా మరో 16 కేసులు, ముగ్గురు అథ్లెట్లకి..

By Chinthakindhi Ramu  |  First Published Jul 26, 2021, 9:57 AM IST

మూడో రోజు కొత్తగా మరో 16 కరోనా పాజిటివ్ కేసులు... ముగ్గురు అథ్లెట్లకీ పాజిటివ్...

148కి చేరిన టోక్యో ఒలింపిక్స్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య... 


టోక్యో ఒలింపిక్స్‌ను కరోనా వైరస్ వదలడం లేదు. మూడో రోజు కొత్తగా మరో 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ముగ్గురు అథ్లెట్లు కావడం విశేషం. వీరితో కలిసి మొత్తంగా టోక్యో ఒలింపిక్స్‌లో కరోనా కేసుల సంఖ్య 148కి చేరింది...

సోమవారం కొత్తగా కరోనా పాజిటివ్ బారిన పడినవారిలో ముగ్గురు అథ్లెట్లు కాగా నలుగురు వారిని కలిసిన సహాయక సిబ్బంది, 8మంది క్రీడా సహాయక బృందంలోని సభ్యులు, ఓ గేమ్స్ ఉద్యోగి ఉన్నారు.

Latest Videos

undefined

అయితే కరోనా బారిన పడిన ముగ్గురు అథ్లెట్లు, ఒలింపిక్ విలేజ్‌లో లేరని, మిగిలిన అథ్లెట్లు కంగారుపడాల్సిన అవసరం లేదని తెలియచేశారు అధికారులు. కరోనా సోకిన వారందరినీ 14 రోజుల క్వారంటైన్‌లోకి పంపించారు.

చెక్ రిప్లబిక్‌తో పాటు అమెరికా, చిలీ, సౌతాఫ్రికా, నెదర్లాండ్ దేశాల నుంచి టోక్యో చేరుకున్నవారు, కరోనా సోకిన వారిలో ఉన్నారు. విశ్వక్రీడల కోసం టోక్యో చేరుకున్నవారికి విమానాశ్రయంలో కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ రావడంతో వారికి అక్కడే క్వారంటైన్ ఏర్పాట్లు చేసింది జపాన్ ప్రభుత్వం.

click me!