టోక్యో ఒలింపిక్స్: రెండో రౌండ్‌లో ఓడిన టీటీ ప్లేయర్ సుత్రీత ముఖర్జీ...

Published : Jul 26, 2021, 09:21 AM IST
టోక్యో ఒలింపిక్స్: రెండో రౌండ్‌లో ఓడిన టీటీ ప్లేయర్ సుత్రీత ముఖర్జీ...

సారాంశం

రెండో రౌండ్‌లో వరల్డ్ నెం.32 సీడెడ్ పోర్చుగ్రీస్ ప్లేయర్ ఫు యూ చేతుల్లో వరుస సెట్లలో ఓడిన సుత్రీత ముఖర్జీ... టీటీ మెన్స్ సింగిల్స్‌లో మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లిన ఆచంట శరత్ కమల్, వుమెన్స్ సింగిల్స్‌లో మానికా బత్రా...

టోక్యో ఒలింపిక్స్‌లో భారత టీటీ ప్లేయర్ సుత్రీత ముఖర్జీ పోరాటం ముగిసింది. తొలి రౌండ్‌లో 2-0 తేడాతో వెనకబడిన తర్వాత అద్భుతంగా పోరాడి విజయం సాధించిన సుత్రీత, రెండో రౌండ్‌లో వరల్డ్ నెం.32 సీడెడ్ పోర్చుగ్రీస్ ప్లేయర్ ఫు యూ చేతుల్లో వరుస సెట్లలో ఓడి, టోర్నీ నుంచి నిష్కమించింది.

తొలి రౌండ్‌ నుంచి ఒత్తిడికి గురైనట్టు కనిపించిన సుత్రీత ముఖర్జీ, 11-3, 11-3, 11-5, 11-5 తేడాతో వరుస సెట్లలో ఓడి 4-0 తో ఓడింది. టీటీ మెన్స్ సింగిల్స్‌లో ఆచంట శరత్ కమల్, వుమెన్స్ సింగిల్స్‌లో మానికా బత్రా రెండో రౌండ్‌లో విజయాలు సాధించి మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే.

ఒలింపిక్స్‌లో నాలుగో రోజు భారత ఆర్చర్లు క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లగా భారత ఫెన్సర్ తొలి రౌండ్‌లో గెలిచి చరిత్ర సృష్టించినా... రెండో రౌండ్‌లో వరల్డ్ నెం.3 ప్లేయర్ చేతిలో పోరాడి ఓడింది. 

PREV
click me!

Recommended Stories

హమ్మయ్యా.! పదేళ్లలో వెయ్యి పరుగులు.. టీ20ల్లో శాంసన్ రేర్ రికార్డు..
తెలుగోడికి హ్యాండ్ ఇచ్చిన ఫ్రాంచైజీలు.. ఏంటి కావ్య పాప.! రూ. 75 లక్షలు కూడా లేవా..