మెన్స్ సూపర్ హెవీవెయిట్ కేటగిరీలో జమైకా బాక్సర్ రిచర్డో బ్రౌన్‌పై విజయం సాధించిన సతీశ్ కుమార్...
టోక్యో ఒలింపిక్స్‌లో క్వార్టర్‌లోకి ప్రవేశించిన తొలి మెన్స్ బాక్సర్‌గా సతీశ్ కుమార్...
టోక్యో ఒలింపిక్స్‌లో భారత బాక్సర్ సతీశ్ కుమార్ క్వార్టర్ ఫైనల్‌లోకి దూసుకెళ్లాడు. మెన్స్ సూపర్ హెవీవెయిట్ కేటగిరీలో (91 కేజీల విభాగంలో) జమైకా బాక్సర్ రిచర్డో బ్రౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో 4-1 తేడాతో విజయం సాధించాడు సతీశ్ కుమార్.
ఈ విజయంతో టోక్యో ఒలింపిక్స్‌లో క్వార్టర్‌లోకి ప్రవేశించిన తొలి మెన్స్ బాక్సర్‌గా నిలిచాడు సతీశ్ కుమార్. ఇప్పటివరకూ బాక్సింగ్‌లో పోటీపడిన భారత మెన్స్ బాక్సర్లు ఆశీష్ కుమార్, వికాస్ కృష్ణన్, మనీశ్ కౌషిక్ తొలి రౌండ్‌లోనే ఓడిన విషయం తెలిసిందే.
undefined
సూపర్‌వెయిట్ కేటగిరీలో భారత జట్టు తరుపున ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న మొట్టమొదటి బాక్సర్ సతీశ్ కుమారే. మహిళల బాక్సింగ్‌లో లవ్‌లీనా, పూజారాణి, మేరీకోమ్ విజయాలు అందుకున్నారు. వీరిలో లవ్‌లీనా, పూజా రాణి ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్‌కి అర్హత సాధించారు.
టోక్యో ఒలింపిక్స్‌లో గురువారం భారత జట్టుకి ఇప్పటిదాకా మంచి ఫలితాలే దక్కాయి. అథానుదాస్ మెన్స్ ఆర్చరీ సింగిల్స్‌లో క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. వరల్డ్ నెం.3 ఆర్చర్ కొరియాకు చెందిన జిన్ హెక్ హూతో జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో షూట్ ఆఫ్‌లో విజయాన్ని అందుకున్నాడు అథానుదాస్.
బ్యాడ్మింటన్‌లో భారత స్టార్ షెట్లర్ పీవీ సింధు, క్వార్టర్ ఫైనల్‌లోకి దూసుకెళ్లగా, భారత పురుషుల హాకీ జట్టు, అర్జెంటీనాపై విజయాన్ని అందుకుంది. రోయింగ్‌లో భారత జోడి అర్వింద్ సింగ్, అర్జున్ లాల్... లైట్ వెయిట్ డబుల్ స్కల్స్ ఫైనల్ బీ ఈవెంట్‌ను ఐదో స్థానంతో ముగించారు.
ఓవరాల్‌గా 6:29.66 టైమ్‌లో రేసును ముగించిన ఈ జోడి టీమిండియాకి బెస్ట్ రిజల్ట్‌ను అందించినా ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయారు. అయితే ఒలింపిక్స్‌లో రోయింగ్ ఈవెంట్‌లో భారత జట్టుకి ఇదే అత్యుత్తమ ప్రదర్శన.