టోక్యో ఒలింపిక్స్: క్వార్టర్ ఫైనల్‌లోకి ఆర్చర్ అథానుదాస్...

By Chinthakindhi Ramu  |  First Published Jul 29, 2021, 8:44 AM IST

వరల్డ్ నెం.3 ఆర్చర్‌పై షూట్ ఆఫ్‌లో విజయాన్ని అందుకున్న అథానుదాస్...

టోక్యో ఒలింపిక్స్‌లో భారత జట్టుకి కలిసివస్తున్న గురువారం...


టోక్యో ఒలింపిక్స్‌లో ఎట్టకేలకు భారత ఆర్చర్లు ఫామ్‌లోకి వచ్చినట్టు కనిపిస్తున్నారు. నిన్న వుమెన్స్ ఆర్చరీలో దీపికా కుమారి, క్వార్టర్ ఫైనల్‌లోకి దూసుకెళ్లగా, నేడు ఆమె భర్త అథానుదాస్ మెన్స్ ఆర్చరీ సింగిల్స్‌లో క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు.

వరల్డ్ నెం.3 ఆర్చర్ కొరియాకు చెందిన జిన్ హెక్ హూతో జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో షూట్ ఆఫ్‌లో విజయాన్ని అందుకున్నాడు అథానుదాస్. మొదటి సెట్ జిన్ హెక్ హు సొంతం చేసుకోగా, వరుసగా రెండు సెట్లు టై అయ్యాయి.

Latest Videos

undefined

నాలుగో సెట్‌ను అథానుదాస్ గెలవగా, కీలకమైన ఐదో సెట్ కూడా టైగా ముగిసింది. విజేతను నిర్ణయించేందుకు షూట్ ఆఫ్ రౌండ్‌ను ఎంచుకోగా... జిన్ హుక్ హూ 9 పాయింట్లు సాధించగా, అథానుదాస్ 10 పాయింట్లు స్కోరు చేసి విజయం సాధించాడు.

అంతకుముందు  చైనీస్ థైపాయ్‌కి చెందిన డెంగ్ యూ చెంగ్‌తో జరిగిన మ్యాచ్‌ను 6-4 తేడాతో సొంతం చేసుకున్నాడు అథానుదాస్.  టోక్యో ఒలింపిక్స్‌లో గురువారం భారత జట్టుకి మంచి విజయాలు దక్కాయి.

బ్యాడ్మింటన్‌లో భారత స్టార్ షెట్లర్ పీవీ సింధు, క్వార్టర్ ఫైనల్‌లోకి దూసుకెళ్లగా, భారత పురుషుల హాకీ జట్టు, అర్జెంటీనాపై విజయాన్ని అందుకుంది. రోయింగ్‌లో భారత జోడి అర్వింద్ సింగ్, అర్జున్ లాల్... లైట్ వెయిట్ డబుల్ స్కల్స్ ఫైనల్ బీ ఈవెంట్‌‌ను ఐదో స్థానంతో ముగించారు.

ఓవరాల్‌గా 6:29.66 టైమ్‌లో రేసును ముగించిన ఈ జోడి టీమిండియాకి బెస్ట్ రిజల్ట్‌ను అందించినా ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయారు. అయితే ఒలింపిక్స్‌లో రోయింగ్ ఈవెంట్‌లో భారత జట్టుకి ఇదే అత్యుత్తమ ప్రదర్శన.

click me!