చైనీస్ థైపాయ్ డెంగ్ యూ చెంగ్‌తో జరిగిన మ్యాచ్‌ను 6-4 తేడాతో సొంతం చేసుకున్న అథానుదాస్...
తర్వాతి రౌండ్‌లో వరల్డ్ మూడో ర్యాంకర్ కొరియాకు చెందిన జిన్ హెక్ హోతో తలబడనున్న అథాను...
టోక్యో ఒలింపిక్స్‌లో మెన్స్ ఆర్చరీ సింగిల్స్‌లో అథానుదాస్‌కి తొలి రౌండ్‌లో విజయం దక్కింది. చైనీస్ థైపాయ్‌కి చెందిన డెంగ్ యూ చెంగ్‌తో జరిగిన మ్యాచ్‌ను 6-4 తేడాతో సొంతం చేసుకున్న అథానుదాస్, రౌండ్ 16కి అర్హత సాధించాడు.
ఆఖరి షాట్‌వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో విజయాన్ని అందుకున్న అథాను దాస్, తర్వాతి రౌండ్‌లో వరల్డ్ మూడో ర్యాంకర్ కొరియాకు చెందిన జిన్ హెక్ హోతో తలబడబోతున్నాడు.
undefined
టోక్యో ఒలింపిక్స్‌లో గురువారం భారత జట్టుకి మంచి విజయాలు దక్కాయి. బ్యాడ్మింటన్‌లో భారత స్టార్ షెట్లర్ పీవీ సింధు, క్వార్టర్ ఫైనల్‌లోకి దూసుకెళ్లగా, భారత పురుషుల హాకీ జట్టు, అర్జెంటీనాపై విజయాన్ని అందుకుంది.
రోయింగ్‌లో భారత జోడి అర్వింద్ సింగ్, అర్జున్ లాల్... లైట్ వెయిట్ డబుల్ స్కల్స్ ఫైనల్ బీ ఈవెంట్‌ను ఐదో స్థానంతో ముగించారు. ఓవరాల్‌గా 6:29.66 టైమ్‌లో రేసును ముగించిన ఈ జోడి టీమిండియాకి బెస్ట్ రిజల్ట్‌ను అందించినా ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయారు.