టోక్యో ఒలింపిక్స్: అదరగొట్టిన మెన్స్ డబుల్ జోడీ... తొలి రౌండ్‌లోనే ఓడిన సాయి ప్రణీత్...

By Chinthakindhi Ramu  |  First Published Jul 24, 2021, 12:21 PM IST

తొలి రౌండ్‌లోనే ఓడిన మెన్స్ సింగిల్స్ ప్లేయర్ సాయి ప్రణీత్...

వరల్డ్ నెం.3 జోడిపై అద్భుత విజయం సాధించిన భారత మెన్స్ డబుల్స్ జోడి సాత్విక్, చిరాగ్ శెట్టి...


టోక్యో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ల నిరాశపూరిత ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ సాయి ప్రణీత్, ఇజ్రాయిల్‌కి చెందిన మిషా జిల్బర్మెన్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో వరుస సెట్లలో ఓడి నిష్కమించాడు.

తొలి సెట్‌లో 13-11 తేడాతో లీడ్‌లో కనిపించిన సాయి ప్రణీత్, ఆ తర్వాత మిషా జోరు ముందు నిలవలేక 17-21 తేడాతో కోల్పోయాడు. ఆ తర్వాత రెండో సెట్‌లో 15-21 తేడాతో ఓడి మెన్స్ సింగిల్స్ పోటీ నుంచి నిష్కమించాడు సాయి ప్రణీత్.

Latest Videos

undefined

మెన్స్ డబుల్స్‌లో మాత్రం భారత డబుల్స్ జోడి సాత్విక్ సాయి రాంకీ రెడ్డి, చిరాగ్ శెట్టి, వరల్డ్ నెం.3 చైనీస్ తైపాయ్ జోడి యాంగ్ లీ, చీ లీ వాంగ్‌ను 21-16, 16-21, 27-25 తేడాతో విజయం సాధించి రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లారు.

భారత వుమెన్ వెయిట్ లిఫ్టర్ మీరాభాయ్ ఛాను రజత పతకాన్ని సాధించి చరిత్ర క్రియేట్ చేసింది. 2000 ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన కరణం మల్లీశ్వరి తర్వాత వెయిట్ లిఫ్టింగ్‌లో ఒలింపిక్ పతకం సాధించిన భారత అథ్లెట్‌గా నిలిచిన మీరాభాయ్ ఛాను, రజతం సాధించిన మొట్టమొదటి భారత మహిళా వెయిట్ లిఫ్టర్‌గా నిలిచింది.

click me!