ఒలింపిక్స్ పతకమే లక్ష్యంగా టోక్యో ఒలింపిక్స్ బరలో సానియా మీర్జా...
యంగ్ ప్లేయర్ అంకితా రైనాతో కలిసి డబుల్స్ ఈవెంట్‌లో పాల్గొననున్న సానియా మీర్జా...
భారత్‌లోని మహిళా క్రీడాకారుల్లో సానియా మీర్జా ఫాలోయింగే వేరు. దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్‌గా కొనసాగుతున్న సానియా మీర్జా, వరల్డ్ నెం.1 టెన్సిస్ ప్లేయర్‌గా నిలిచి, రికార్డు క్రియేట్ చేసింది.
క్రికెట్‌కి బీభత్సమైన క్రేజ్ వచ్చి, మిగిలిన ఏ క్రీడలను యూత్ పట్టించుకోని సమయంలో సానియా మీర్జా, టెన్సిస్‌లో సంచలన విజయాలు నమోదుచేసి, అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంది. ఆటతోనూ కాదు, తన అందంతోనూ కుర్రకారు మతులు పోగొట్టింది...
పెళ్లై, ఓ బిడ్డకు తల్లైన తర్వాత 34 ఏళ్ల వయసులో ఒలింపిక్స్ పతకమే లక్ష్యంగా టోక్యోకి వెళ్లనుంది సానియా మీర్జా. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే ముందు సానియా చేసిన ఓ ఇన్‌స్టాగ్రామ్ రీల్ వీడియో, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇండియా అని రాసి ఉన్న ఒలింపిక్ కిట్, బ్లూ జెర్సీని ధరించిన సానియా మీర్జా, అమెరికన్ ర్యాపర్ డోజా క్యాట్స్ ‘కిస్ మీ మోర్’ పాటకు స్టెప్పులు వేసింది. తన పేరులో ‘ఏ’ అనే అక్షరంలో నా జీవితంలో చాలా క్షణాలు దాగి ఉన్నాయని కన్నుగీటి, స్టెప్పులు వేస్తూ తెలిపింది సానియా...
అగ్రెషన్ (దూకుడు, కసి), అంబిషన్ (లక్ష్యం), అఛీవ్ (విజయం), ఎఫెక్షన్ (అనుబంధం)... ఉన్నాయంటూ తన టెన్నిస్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను జత చేసింది సానియా మీర్జా. సానియా మీర్జాకి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది.
ధోనీ భార్య సాక్షి సింగ్‌తో పాటు దాదాపు లక్షా 21 వేల మంది ఈ వీడియోకి లైక్ కొట్టగా... ‘డ్యాన్స్ మూవ్స్ బాగున్నాయి, ముఖ్యంగా ఆ కన్నుకొట్టడం అదిరిపోయింది...’ అంటూ బిర్లా వారసురాలు, సింగర్ అనన్య బిర్లా కామెంట్ చేసింది.
భారత టెన్నిస్ యంగ్ ప్లేయర్ అంకితా రైనాతో కలిసి ఒలింపిక్స్‌లో వుమెన్స్ డబుల్స్ ఈవెంట్‌లో పాల్గొననున్న సానియా మీర్జా, మిక్స్‌డ్ డబుల్స్‌లో సీనియర్ మెన్స్ ప్లేయర్ రోహన్ బోపన్నతో కలిసి ఆడనుంది.