ఈ మ్యాచ్ లపై పెద్ద ఎత్తున బెట్టింగ్ జరిగినట్లు సమాచారం అందింది. దీంతో.. దీనిపై సంబంధిదత అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
వింబుల్డన్ లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా..? అవుననే సందేహాలు కలుగుతున్నాయి. ఇటీవల జరిగిన రెండు మ్యాచుల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందనే అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో.. అధికారులు దీనిపై దర్యాప్తు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఒక సింగిల్ మ్యాచ్, మరో డబుల్స్ మ్యాచ్ లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్లు ఇంటర్నేషనల్ టెన్నిస్ ఇంటెగ్రిటీ ఏజెన్సీ గుర్తించింది. ఈ మ్యాచ్ లపై పెద్ద ఎత్తున బెట్టింగ్ జరిగినట్లు సమాచారం అందింది. దీంతో.. దీనిపై సంబంధిదత అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
undefined
మెన్స్ డబుల్స్ ఫస్ట్ రౌండ్ మ్యాచ్ పై ఎక్కువ అనుమానాలు కలగడం గమనార్హం. ఈ మ్యాచ్ లో ఫేవరేట్ జోడి పై ఎక్కువ మంది గెలుస్తారని బెట్ కాయగా.. ఆ జట్టు ఓడిపోయింది. దీంతో.. అందరికీ ఈ మ్యాచ్ పై అనుమానాలు కలిగాయి.
ఇక మరొకటి జర్మన్ ప్లేయర్ ఆడిన ఫస్ట్ రౌండ్ సింగిల్స్ మ్యాచ్. అయితే ఆ ప్లేయర్ ప్రత్యర్థిపై ఈ మ్యాచ్‌లో అనుమానాలు ఉన్నాయి. సెకండ్ సెట్ తర్వాత పరిస్థితిపై ఐదు అంకెలలో బెట్టింగ్ నడిచినట్లు తేలింది. ఈ మ్యాచ్‌లో సర్వీస్ గేమ్స్ సంఖ్యపై కూడా ప్రత్యేక బెట్స్ నడిచాయి. దీంతోపాటు ఈ ఏడాది ఏప్రిల్, జూన్ మధ్య మొత్తం 11 మ్యాచ్‌లపై ఫిక్సింగ్ ఫిర్యాదులను ఐటీఐఏ అందుకుంది.