యూనివర్స్ బాస్... ఇప్పుడు జస్ట్ బాస్ అయ్యాడు..!

Published : Jul 14, 2021, 11:45 AM IST
యూనివర్స్ బాస్... ఇప్పుడు జస్ట్ బాస్ అయ్యాడు..!

సారాంశం

ఈ మ్యాచ్ విజయం తర్వాత గేల్.. మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో.. ఆసక్తికర విషయాన్ని తెలియజేశాడు. తాను ప్రస్తుతం  జస్ట్ బాస్ అనే విషయాన్ని తెలియజేశాడు.

వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ ని అభిమానులంతా ముద్దుగా యూనివర్స్ బాస్ అని పిలుచుకునేవారు. అయితే.. ఇప్పుడు ఆయన యూనివర్స్ బాస్ కాదు.. కేవలం బాస్ గా మారాడు. గత కొంతకాలంగా అందరిచేత యూనివర్స్ బాస్ అని పిలిపించుకున్న గేల్.. ఇప్పుడు తన బ్యాట్ మీద కేవలం బాస్ అని రాసుకోవడం గమనార్హం.

ఇంతకీ మ్యాటరేంటంటే... ఇటీవల వెస్టిండీస్.. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కోసం తలపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. మూడో టీ20లో గేల్ చెలరేగి ఆడాడు. దీంతో.. విస్టిండీస్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ విజయం తర్వాత గేల్.. మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో.. ఆసక్తికర విషయాన్ని తెలియజేశాడు. తాను ప్రస్తుతం  జస్ట్ బాస్ అనే విషయాన్ని తెలియజేశాడు.

‘ మీ బ్యాట్ పై ఏముంది’ అంటూ.. విలేకరి అడిగిన ప్రశ్నకు.. గేల్ అసలు విజయాన్ని తెలియజేశాడు. గతంలో తన బ్యాట్ మీద యూనివర్స్ బాస్ అని ఉండేదని.. ఇప్పుడు ది బాస్ అని ఉందని చెప్పాడు. దానికి కారణమేంటని అడగగా.. తాను యూనివర్స్ బాస్ గా ఉండటం.. ఐసీసీకి ఇష్టం లేదని.. అందుకే.. తాను మార్చుకున్నానని అతను చెప్పడం విశేషం. ఈ విషయం తెలిసి.. గేల్ అభిమానులు నిరాశకు గురవ్వడం గమనార్హం. 

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !