టీమిండియాతో అనుష్క ఫోటో... ఆడటానికి వెళ్లారా..? హనీమూన్ కోసం వెళ్లారా అంటూ ఫ్యాన్స్ సెటైర్లు

First Published 8, Aug 2018, 12:17 PM IST
Highlights

తొలి టెస్టులో గెలిచే మ్యాచ్‌ను చేజేతులా కోల్పోవడంతో భారత అభిమానులు టీమిండియాపై ఫైర్ అవుతున్నారు. ఏమాత్రం బాధ్యత లేకుండా చెత్త షాట్లు ఆడి ఓటమి పాలయ్యారని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ షేర్ చేసిన ఫోటో అభిమానుల ఆగ్రహానికి మరింత ఆజ్యం పోసింది.

తొలి టెస్టులో గెలిచే మ్యాచ్‌ను చేజేతులా కోల్పోవడంతో భారత అభిమానులు టీమిండియాపై ఫైర్ అవుతున్నారు. ఏమాత్రం బాధ్యత లేకుండా చెత్త షాట్లు ఆడి ఓటమి పాలయ్యారని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ షేర్ చేసిన ఫోటో అభిమానుల ఆగ్రహానికి మరింత ఆజ్యం పోసింది. టీమిండియా ఆటగాళ్లు లండన్‌లోని భారత హై కమిషన్ కార్యాలయాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా దిగిన ఫోటోలో కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లు, సహాయ సిబ్బంది ఉన్నారు. అంతవరకు బాగానే ఉంది.. అయితే వీరితో పాటు బాలీవుడ్ నటి, కోహ్లీ సతీమణి అనుష్కశర్మ ఉండటం వివాదాస్పదమవుతోంది. ‘‘టీమిండియా అధికారిక కార్యక్రమానికి ప్రైవేట్ వ్యక్తులు హాజరు కావడం ఏంటంటూ’’ సోషల్ మీడియాలో చిర్రుబుర్రులాడుతున్నారు.

‘‘ఏమాత్రం విజ్ఞత లేకుండా అనుష్మ శర్మ ప్రవర్తించిందని.. వీళ్లేనా చెత్త గురించి సోషల్ మీడియాలో నీతులు బోధించిందని’’ విమర్శిస్తున్నారు. ‘‘ఇంగ్లాండ్ టూర్‌కు కొందరి భార్యలను మాత్రమే ఎందుకు అనుమతించింది.. వారు క్రికెట్ ఆడటానికి వెళ్లారా..? లేక హనీమూన్‌కా’’ అని ప్రశ్నించారు.. ‘‘టీమిండియా వైస్ కెప్టెన్ చివర ఎక్కడో  నిలబడితే.. జట్టుతో ఏమాత్రం సంబంధం లేని టీమిండియా ఫస్ట్ లేడీ మాత్రం ముందు నిలబడిందని’’ ఆరోపించారు.
 

Last Updated 8, Aug 2018, 12:17 PM IST