పాకిస్థాన్‌ మ్యాచ్‌లో గాయపడ్డ హర్దిక్ పాండ్యా... స్ట్రెచర్ పై గ్రౌండ్ బయటకు తరలింపు

By Arun Kumar PFirst Published Sep 19, 2018, 7:33 PM IST
Highlights

ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్ జట్టుతో ఉత్కంటభరితంగా సాగుతున్న మ్యాచ్ లో టీంఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది. భారత ఆటగాడు హర్దిక్ పాండ్యా గాయం కారణంగా మ్యాచ్ కు దూరం కావాల్సి వచ్చింది. పాండ్యా బౌలింగ్ చేస్తూ గ్రౌండ్ లోనే కుప్పకూలడంతో వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించారు. అయినా పాండ్యా నడిచే పరిస్థితిలో లేకపోవడంతో స్ట్రెచర్ పై అతన్ని గ్రౌండ్ లోంచి బైటికి తీసువచ్చారు. 

ఈ ఘటన 17 వ ఓవర్లో చోటుచేసుకుంది. పాండ్యా బౌలింగ్ చేస్తున్న క్రమంలో గాయపడ్డాడు. పాండ్యా పరుగెత్తుకుంటూ వస్తుండగా కాలు స్లిప్ అయింది. దీంతో అతడి నడుము భాగంలో గాయమైనట్లు బిసిసిఐ తెలిపింది. ఈ నొప్పిని తట్టుకోలేక అతడు గ్రౌండ్ లోనే కుప్పకూలాడు. దీంతో పిజియో వచ్చి ప్రాథమిక చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో అతడిని స్ట్రెచర్ పై బయటకు తరలించారు. ఇతడి ఓవర్ లో మరో బాల్ మిగిలిపోవడంతో రాయుడు ఆ బంతి వేసి ఓవర్ పినిష్  చేశాడు. పాండ్యా స్థానంలో మనీష్ పాండే సబ్‌స్టిట్యూట్ గా పీల్డింగ్ చేస్తున్నాడు. 

Injury update - has an acute lower back injury. He is able to stand at the moment and the medical team is assessing him now.
Manish Pandey is on the field as his substitute pic.twitter.com/lLpfEbxykj

— BCCI (@BCCI)

click me!