ఆసియా కప్: పాకిస్తాన్ ను చితక్కొట్టిన ఇండియా

By Arun Kumar PFirst Published Sep 19, 2018, 5:11 PM IST
Highlights

ఆసియా కప్ లో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ పై సర్వత్రా ఉత్కంట నెలకొంది. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మ్యాచ్ ఎట్టకేలకు ప్రారంభమైంది.

ఆసియా కప్ లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచులో పాకిస్తాన్ ను భారత్ చితక్కొట్టింది. పాకిస్తాన్ పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పాకిస్తాన్ తమ ముందు ఉంచిన 163 పరుగుల లక్ష్యాన్ని భారత్ అలవోకగా ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ధాటిగా ఆడి తర్వాతి బ్యాట్స్ మెన్ కు ఇబ్బంది లేకుండా చూశారు. రెండు వికెట్లు మాత్రమే 29 ఓవర్లలోనే భారత్ విజయాన్ని అందుకుంది. అంబటి రాయుడు (31), దినేష్ కార్తిక్ (31) నాటౌట్ గా నిలిచారు. పాకిస్తాన్ బౌలర్లలో ఫహీమ్ అస్రాఫ్, షాదాబ్ ఖాన్ చెరో వికెట్ తీశారు.

 పరుగుల వరద పారించిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ 39 బంతుల్లో 52 పరుగులు చేసి అవుటయ్యాడు. దాంతో భారత్ 86 పరగుుల వద్ద తొలి వికెట్ ను కోల్పోయింది. 104 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోోయింది. దూకుడుగా ఆడుతూ వచ్చిన శిఖర్ ధావన్ 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. వీరిద్దరు అవుటైన తర్వాత మరో వికెట్ పడకుండా దినేష్ కార్తిక్, అంబటి రాయుడు జాగ్రత్త పడ్డారు.

పాకిస్తాన్ తమ ముందు ఉంచిన 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ దూకుడు పెంచాడు. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన అతను ఆ తర్వాత ఫోర్లు, సిక్స్ లతో పాకిస్తాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన దాయాదుల పోరులో భారత బౌలర్లు విజృంభించారు. పాకిస్థాన్ జట్టును కేవలం 162 పరుగులకే కట్టడి చేశారు. మ్యాచ్ ప్రారంభం నుంచి భారత బౌలర్ల ఆదిపత్యమే కొనసాగింది. మధ్యలో షోయబ్ మాలిక్, బాబర్ ఆజమ్ లు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే వారు అవుటైన తర్వాత మిగతా బ్యాట్ మెన్స్ కూడా చేతులెత్తేశారు. దీంతో భారత జట్టు ముందు పాకిస్థాన్ 163 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. 

భారత బౌలర్లు భువనేశ్వర్ కుమార్ 3, కేదార్ జాదవ్ 3, బుమ్రా 2, కుల్దీప్ యాద్ 1 వికెట్ తీసుకున్నారు. పాకిస్థాన్ టీం లో కేవలం నలుగురు ఆటగాళ్లే రెండంకెల స్కోరు సాధించగలిగారు. భారత బౌలర్ల దాటికి పాకిస్థాన్ బ్యాట్ మెన్స్ విలవిల్లాడిపోయారు. కేవలం 160 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన పాక్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. 

బాబర్, షోయబ్ మాలిక్ నిలకడగా ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడటంతో పాకిస్థాన్ జట్టు కోలుకున్నట్లు కనిపించింది. అయితే అయితే మూడో వికెట్ రూపంలో బాబర్ అవుటవడంతో మళ్లీ పాకిస్థాన్ జట్టుకు కష్టాలు మొదలయ్యాయి. ఇతడు అవుటవగానే క్రీజులోకి వచ్చిన సర్పరాజ్ అహ్మద్ కేవలం ఆరు పరుగులే చేసి ఔటయ్యాడు. ఆ వెంటనే షోయబ్ మాలిక్ కూడా రాయుడు చేతిలో రనౌటయ్యాడు.  ఆ తర్వాత ఆసిఫ్ అలీ కూడా వెంటనే  ఔటయ్యాడు. దీంతో 110 పరుగులకే పాకిస్థాన్ ఆరు వికెట్లు కోల్పోయింది. 

3 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ పాకిస్థాన్ జట్టును బాబర్, షోయబ్ మాలిక్ లు ఆదుకున్నారు. అయితే 47 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బాబార్ ఆజమ్ అవుటయ్యాడు. హాప్ సెంచరీకి మూడు పరుగుల దూరంలో అవుటవడంతో కాస్త నిరాశతో బాబర్ పెవిలియన్ బాట పట్టాడు. 

టీంఇండియా వికెట్ కీపర్ ధోని షోయబ్ మాలిక్ ను ఔట్ చేసే మంచి సదవకాశాన్ని మిస్ చేశాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో షోయబ్ మాలిక్ క్యాచ్ ని ధోని అందుకోలేకపోయాడు. దీంతో పాకిస్థాన్ జట్టు మరో వికెట్ పడకుండా 63 పరుగులు చేసింది.

పాకిస్థాన్ జట్టుపై భారత భౌలర్లు విరుచుకుపడ్డారు. భారత పేస్ భౌలింగ్ దాటికి తల్లుకోలేక ఇద్దరు పాకిస్థాన్ ఓపెనర్లు కేవలం మూడు పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. ఇద్దరు ఓపెనర్లను భువనేశ్వర్ కుమారే ఔట్ చేశాడు. రెండు పరుగుల వద్దే పాకిస్థాన్ జట్టు ఓ వికెట్ కోల్పోయింది. ఈ రెండు పరుగులు ఇమామ్ ఉల్ హక్ సాధించినవే. .టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు మొదట బ్యాటింగ్ కు దిగింది.

ఇరుజట్ల ఆటగాళ్ల వివరాలు:

ఇండియన్ టీమ్: రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ,దినేశ్ కార్తీక్, కేదార్ జాధవ్, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ సింగ్ బుమ్రా, యజువేందర్ చాహల్, కుల్దీప్ యాదవ్

పాకిస్థాన్ టీమ్: ఇమామ్ ఉల్ హక్, ఫకార్ జమాన్, బాబర్ ఆజమ్, షోయబ్ మాలిక్, సర్ఫరాజ్ అహ్మద్ (కెప్టెన్), ఆసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అస్రప్, మహ్మద్ ఆమీర్, హసన్ అలీ, ఉస్మాన్  ఖాన్

 

 

click me!