ఈ విజయం నాది కాదు...ఆయనదే: కోహ్లీ

By Arun Kumar PFirst Published Jan 16, 2019, 8:33 AM IST
Highlights

ఆస్ట్రేలియాతో జరుగిన నిర్ణయాత్మక రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. ఇలా కీలకమైన సమయంలో పరుగులు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కానీ ఈ విజయం నావల్ల కాదు...మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వల్లే సాధ్యమయ్యిందని కొనియాడుతూ కోహ్లీ తన సింప్లిసిటీ, క్రీడాస్పూర్తిని మరోసారి చాటుకున్నారు. 
 
మొదటి వన్డేలో ఓడిన భారత్, రెండో వన్డేలో గెలిని మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను సమం చేసింది. ఆసిస్ జట్టు నిర్ధేశించిన 298 పరుగుల భారీ లక్ష్యం చేధించి భారత్ వన్డే సీరిస్‌పై ఆశలను సజీవంగా ఉంచింది. లక్ష్యాన్ని చేధించే క్రమంలో కోహ్లీ(104 పరుగులు) సెంచరీతో చెలరేగడంతో భారత్ విజయం నల్లేరుపై నడకే అనుకున్నారు. కానీ వెంటవెంటనే భారత్ వికెట్లు కోల్పోవడంతో చివరి క్షణంలో ఉత్కంఠ ఏర్పడగా మ్యాచ్ పినిషర్ ధోని(55 నాటౌట్) తనదైన బ్యాటింగ్ ప్రదర్శనతో భారత్ ను విజయతీరాలకు చేర్చాడు.  

ఈ మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ...ఈ విజయం క్రెడిత్ మొత్తం ధోనీకే దక్కుతుందంటూ కితాబిచ్చాడు. ఈ రోజు ఆయన చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడి భారత్ కు విజయాన్ని అందించాడని పేర్కొన్నాడు. ఈ విజయంలో కీలకంగా వ్యవహరించి తనకు మద్దతుగా నిలిచిన ధోనికి హ్యాట్సాఫ్. సరైతన సమయంలో తన సత్తా ఏంటో ధోని మరోసారి నిరూపించుకున్నారంటూ కోహ్లీ కొనియాడారు. 

ఇక ఈ మ్యాచ్ లో చక్కగా బౌలింగ్ చేసి ఆసిస్ బ్యాట్ మెన్స్ ని కట్టడి చేయడంతో భువనేశ్వర్ కుమార్ చాలా బాగా రాణించాడని కోహ్లీ అన్నారు. మ్యాక్స్ వెల్, మార్ష్ లను ఔట్ చేసిన ఆ రెండు బంతులు అద్భుతమన్నాడు. అయితే ఆసిస్ ను తక్కువ పరుగులకు కట్టడి చేయడంలో కొంత విఫలమయ్యామని కోహ్లీ అన్నాడు.  

ఇక ఈ సీరిస్ లో చావో రేవో తేల్చుకోవాల్సిన చివరి మ్యాచ్ కోసం సిద్దంగా వున్నామని కోహ్లీ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ తర్వాత కాస్త విరామ దొరికింది కాబట్టి దాన్ని ఆస్వాదించి చివరి మ్యాచ్ విజయం కోసం సమాయత్తం అవుతామని కోహ్లీ తెలిపాడు.  

సంబంధిత వార్తలు 

జడేజా షార్ప్ త్రో చూశారా: ఖవాజాకు షాక్

ఆసీస్ పై భారత్ విజయం: ధోనీయే ఫినిషర్, సిరీస్ సమం
 
click me!