దక్షిణ కొరియా ప్రభంజనం.. జర్మనీ పలాయనం..!

Published : Jun 28, 2018, 10:32 AM IST
దక్షిణ కొరియా ప్రభంజనం.. జర్మనీ పలాయనం..!

సారాంశం

దక్షిణ కొరియా ప్రభంజనం.. జర్మనీ పలాయనం..!

హైదరాబాద్: గ్రూప్ దశలోనే డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ ఇంటిదారి పట్టిన సంచలనం బుధవారం దక్షిణ కొరియా, జర్మనీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకుంది. 2-0తో జర్మనీపై దక్షిణ కొరియా అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆట ఆరంభం నుంచి హోరాహోరీగా సాగింది. వరల్డ్ నంబర్ వన్ జర్మనీకి వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 57వ స్థానంలో ఉన్న దక్షిణ కొరియా గట్టి పోటీ ఇచ్చింది. బాల్ జర్మనీ కంట్రోల్లో ఉన్నప్పటికీ అడుగడుగునా అడ్డు తగులుతూ ఆటంకం కలిగించింది. దీంతో మ్యాచ్ నువ్వా, నేనా అన్నట్టుగా ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. అలా ఫస్టాఫ్‌లో ఒక్క గోల్ కూడా లేక 0-0తో ముగిసింది.


సెకండాఫ్‌లోనూ ఇదే పరిస్థితి పునరావృతమైంది. జర్మనీది అడుగు ముందుకు వేయలేని అయోమయ పరిస్థితి. 90 నిముషాలూ ఇదే తంతు కొనసాగింది. ఆ క్రమంలో జర్మనీ కొన్ని మంచి చాన్స్‌లు మిస్ చేసుకుంది. 91వ నిముషంలో కిమ్ యాంగ్ గైన్, 95వ నిముషంలో సాన్ హెంగ్ మిన్ చెరో గోల్ సాధించడంతో దక్షిణ కొరియా 2-0తో జర్మనీపై ఘన విజయం సాధించింది.

PREV
click me!

Recommended Stories

5 Wickets in 1 Over : W, W, W, W, W... ఒకే ఓవర్‌లో 5 వికెట్లు.. అంతర్జాతీయ క్రికెట్ కొత్త చరిత్ర
Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !