ఫిఫా 2018 లో చరిత్ర సృష్టించిన ప్రాన్స్, డెన్మార్క్ మ్యాచ్ (వీడియో)

First Published Jun 27, 2018, 2:43 PM IST
Highlights

గోల్ లెస్ మ్యాచ్ గా...

హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన ప్రాన్స్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఫిఫా వరల్డ్ కప్ గ్రూప్ సి లో డెన్మార్క్ తో నిన్న జరిగిన మ్యాచ్  0-0 తో డ్రా అయ్యింది. ఇప్పటివరకు 2018 ప్రపంచకప్‌లో 37 మ్యాచ్‌లు జరగ్గా, ఇలా ఒక్క గోల్ కూడా లేకుండా ముగిసిన మ్యాచ్ ఇదొక్కటే. ఫలితంగా ఈ ఈవెంట్‌లో తొలి గోల్ లేస్ డ్రాగా ఈ మ్యాచ్ రికార్డులకెక్కింది. 

ఇక ఇప్పటికే నాకౌట్‌ చేరిన ఫ్రాన్స్‌ ఏడు పాయింట్లతో  గ్రూప్‌ ‘సి’లో టాపర్‌గా నిలిచింది. డెన్మార్క్‌ ఐదు పాయింట్లతో రెండో స్థానం దక్కించుకుంది. దీంతో ఈ రెండు జట్లు ఇప్పటికే నాకౌట్ కు చేరుకున్నాయి. 

ఈ మ్యాచ్ లో ప్రాన్స్ ఆధిపత్యమే ఎక్కువగా కనిపించినా గోల్ మాత్రం చేయలేకపోయింది. జోరు మీదున్న ఫ్రాన్స్‌ ఆటగాళ్లను నిలువరించడంలో డెన్మార్క్‌ జట్టు సఫలమైంది.  

ఈ మ్యాచ్ లో తొలి అర్ధభాగంలో ఇరు జట్లకు గోల్ చేయడానికి చిన్నచిన్న అవకాశాలు వచ్చాయి. అయితే రెండో అర్ధభాగంలో రెండు జట్టు హోరాహోరీగా పోరాడటంతో గోల్ చేయడానికి ఒక్క చాన్స్ కూడా రాలేదు.  26వ నిమిషంలో డెన్మార్క్ స్ట్రయికర్ ఎరిక్సన్ కొట్టిన ఫ్రీకిక్ దాదాపుగా గోల్‌పోస్ట్‌లోకి వెళ్లినట్లుగా కనిపించింది. కానీ ఫ్రాన్స్ గోల్ కీఫర్ దాన్ని సమర్థవంతంగా అడ్డుకున్నారు. మ్యాచ్ మొత్తంలో ఫ్రాన్స్ 11సార్లు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పైకి దాడికి దిగగా, డెన్మార్క్ ఐదుసార్లు ప్రయత్నించింది. అయినా ఫలితం లేకుండా పోయింది.

  
 "
  

click me!