అది Cricket గ్రౌండ్‌ అనుకున్నారా..ఏం అనుకున్నారు..మైదానంలోనే పొట్టుపొట్టు కొట్టుకున్న బ్యాట్స్‌మెన్‌!

Published : May 30, 2025, 11:26 AM IST
cricket

సారాంశం

క్రికెట్ లో ఇప్పటి వరకు దూషణలే కానీ..కొట్టుకోవడానికి చోటు లేదు. కానీ ఇక్కడ ఇద్దరు బ్యాట్స్ మెన్ మాత్రం కొట్టుకునే వరకు వెళ్లింది.సహచరులు వీరిని విడదీశారు. అసలు గొడవకు దిగిన బ్యాట్స్‌మెన్‌ ఎవరు, ఇది ఎక్కడ జరిగింది అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

క్రికెట్ అంటే కేవలం బ్యాట్‌ తో బాల్‌ ని కొట్టడమే కానీ...ప్రత్యర్థులు మాటల యుద్ధం వరకే కానీ చేతల యుద్ధానికి దిగిన దాఖలలు లేవు. కానీ ఇక్కడ మాత్రం ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ ముందు వాగ్వాదానికి దిగారు..అది కాస్త ముదరడంతో ఒకరినొకరు కొట్టుకునే వరకు వెళ్లారు. దక్షిణాఫ్రికా

తీవ్ర వాగ్వాదానికి…

బంగ్లాదేశ్‌ వర్ధమాన జట్ల మధ్య నాలుగురోజుల మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది.తాజాగా ఈ విషయం సోషల్‌ మీడియాలో షికారు చేస్తోంది. దక్షిణాఫ్రికా బౌలర్‌ షెపో ఎంటులి,బంగ్లా బ్యాటర్‌ రిపాన్‌ మోండాల్‌ తీవ్ర వాగ్వాదానికి దిగారు. ముందు పోట్లాటే అనుకున్న వీరి గొడవ నెట్టుకునే వరకు వెళ్లింది.తరువాత ఏకంగా కొట్టుకునేందుకు సిద్ధమవుతుండగా ...ఫీల్డ్‌ లోని మిగిలిన వారు వారిద్దరినీ విడదీశారు.

 

 

ఎదురుదాడికి…

ఎంటులి బౌలింగ్‌లో రిపాన్‌ సిక్స్‌ కొట్టాడు. సహచర బ్యాటర్‌ మెహదీ హసన్‌ అతడిని అభినందించాడు. దీంతో అంపైర్‌ వైపు వస్తుండగా రిపాన్‌పై ఎంటులి దాడికి దిగాడు. అతడి ఛాతిపై కొట్టాడు. రిపాన్‌ కూడా ఎదురుదాడికి దిగాడు. కొందరు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు సైతం రిపాన్‌ను దుర్భాషలాడారు. అంపైర్లు అడ్డుపడడంతో గొడవ అంతటితో సద్దుమణిగింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Fastest ODI Double Century : వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. బద్దలైన మాక్స్‌వెల్, గేల్ రికార్డులు
IND vs SA : టీ20 క్రికెట్ అంటే అంతే బాసూ.. సూర్యకుమార్ యాదవ్ భయం అదే !