చాలా కష్టపడ్డాను.. కాంస్యం గెలవడంపై సింధు స్పందన

By telugu news teamFirst Published Aug 2, 2021, 3:17 PM IST
Highlights

డిఫెన్స్ మెరుగుపరుచుకోవడంతోనే పతకం సాధ్యమైందన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో ప్రాక్టీస్ ఎంతో ఉపయోగపడిందన్నారు. 

టోక్యో ఒలంపిక్స్ కోసం తాను చాలా కష్టపడ్డానని ఒలంపిక్ విజేత పీవీ సింధు పేర్కొన్నారు. ఈ ఒలంపిక్స్ లో కాంస్యం గెలవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. సోమవారం ఆమె టోక్యో నుంచి కోచ్ పార్క్ తో కలిసి విలేకరులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. కరోనా సమయంలో తన బలహీనతలపై దృష్టిపెట్టానని చెప్పారు. తనకు శిక్షణ ఇచ్చేందుకు తన కోచ్ కూడా చాలా కష్టపడ్డారన్నారు. డిఫెన్స్ మెరుగుపరుచుకోవడంతోనే పతకం సాధ్యమైందన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో ప్రాక్టీస్ ఎంతో ఉపయోగపడిందన్నారు. 

దేశానికి పతకం తీసుకురావడం చాలా గర్వంగా ఉందన్నారు. అదే సమయంలో సెమీస్ లో ఓడిపోవడం చాలా బాధగా అనిపించిందన్నారు. సెమీస్ లో ఒటమి సమయంలో భావోద్వేగానికి లోనయ్యానని చెప్పారు. అయితే.. కాంస్యం అవకాశం ఉంది కదా అని తనకు తాను సర్ధిచెప్పుకున్నట్లు చెప్పారు. పారిస్ ఒలంపిక్స్ కి ఇంకా చాలా సమయం ఉందని.. ప్రస్తుతానికి విజయాన్ని ఆస్వాదిస్తున్నానని చెప్పారు.ఈ  విజయాన్ని తన కుటుంబసభ్యులకు , అభిమానులకు అంకితమిస్తున్నట్లు చెప్పారు. 

click me!