వారందరికీ సింధు రోల్ మోడల్.. అభినవ్ బింద్రా

By telugu news teamFirst Published Aug 2, 2021, 10:53 AM IST
Highlights

ఒలంపిక్ గోల్డ్ విన్నర్ అభినవ్ బింద్రా సైతం తాజాగా.. సింధు విజయంపై స్పందించారు. టోక్యో ఒలంపిక్స్ లో కాంస్యం గెలిచిన సింధుకి శుభాకాంక్షలు తెలిపిన అభినవ్ బింద్రా.. ఆమె గురించి అద్భుతమైన కామెంట్ చేశారు.

తెలుగు తేజం పీవీ సింధు మరోసారి మన దేశ గౌరవాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసింది. 2016లో రియో ఒలంపిక్స్ లో సిల్వర్ గెలిచిన సింధు... ఈ సారి కాంస్యం సాధించింది. ఈ సందర్భంగా ఆమెకు ప్రపంచ నలుమూలల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఆమెపై అభిమానులు, క్రీడాకారులు, సెలబ్రెటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

కాగా.. తాజాగా.. ఒలంపిక్ గోల్డ్ విన్నర్ అభినవ్ బింద్రా సైతం తాజాగా.. సింధు విజయంపై స్పందించారు. టోక్యో ఒలంపిక్స్ లో కాంస్యం గెలిచిన సింధుకి శుభాకాంక్షలు తెలిపిన అభినవ్ బింద్రా.. ఆమె గురించి అద్భుతమైన కామెంట్ చేశారు.

Congratulations ! You make us super proud !!! pic.twitter.com/55lMOCQeMc

— Abhinav A. Bindra OLY (@Abhinav_Bindra)

ఓ మహిళా క్రీడాకారిణి ఒలంపిక్స్ లో రెండు పతకాలు గెలవడం చాలా అసాధారణమైన విషయమన్నారు. వచ్చేతరం క్రీడాకారులందరికీ.. సింధు రోల్ మోడల్ గా నిలుస్తుందని.. అది వాళ్ల అదృష్టమంటూ అభినవ్ బింద్రా పేర్కొన్నారు. సింధు మనందరినీ గర్వపడేలా చేసిందని అభినవ్ పేర్కొన్నారు. 

 

కాగా.. అభినవ్ బింద్రా షూటింగ్ లో 2012 లో లండన్ లో జరిగిన ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించారు. ఆయన ఇప్పుడు సింధుపై ప్రశంసలు కురిపించడం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 

శనివారం సెమీ ఫైనల్స్ సింధు ఓటమి చవిచూడగా.. అభిమానులంతా నిరాశకు గురయ్యారు, అయితే.. ఆ తర్వాతి రోజు కాంస్యం కోసం తలపడిన సింధు.. అద్భుతమైన విజయాన్ని చవి చూసింది. దీంతో.. భారతీయులంతా ఆనందంతో సంబరాలు జరుపుకుంటున్నారు.

click me!