ఆసీస్ మాజీ క్రికెటర్ షేన్‌ వార్న్‌కి కరోనా పాజిటివ్... ది హండ్రెడ్ టోర్నీలో...

By Chinthakindhi RamuFirst Published Aug 2, 2021, 11:22 AM IST
Highlights

ది హండ్రెడ్ క్రికెట్ టోర్నీలో లండన్ స్పిరిట్ జట్టుకి హెడ్ కోచ్‌గా ఉన్న వార్న్...

టోర్నీ ప్రారంభమయ్యి 10 రోజులు కూడా కాకముందే ఇద్దరు కోచ్‌లకు కరోనా పాజిటివ్... 

ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్, కరోనా బారిన పడ్డాడు. ప్రస్తుతం ది హండ్రెడ్ క్రికెట్ టోర్నీలో లండన్ స్పిరిట్ జట్టుకి హెడ్ కోచ్‌గా ఉన్న వార్న్, కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఈ సరికొత్త లీగ్‌లో పాల్గొంటున్న క్రికెటర్లలో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

లార్డ్స్‌లో సౌదరన్ బ్రేవ్, లండన్ స్పిరిట్ మధ్య మ్యాచ్ ప్రారంభానికి ముందే వార్న్‌కి పాజిటివ్ రావడం విశేషం. ది హెండ్రెడ్ టోర్నీ ప్రారంభమయ్యి 10 రోజులు కూడా కాకముందే ఇద్దరు కోచ్‌లు కరోనా బారిన పడడం విశేషం.

ట్రెంట్ రాకెట్స్ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ కూడా కరోనా పాజిటివ్‌గా తేలాడు. ఇన్నింగ్స్‌లో 100 బంతులతో తీసుకొచ్చిన ఈ న్యూ ఫార్మాట్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దీనికంటే టీ20 చాలా బెటర్‌ అంటూ విమర్శలు చేస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు.  

ఈ టోర్నీకి కామెంటేటర్‌గా వ్యవహారిస్తున్న భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ‘ఈ టోర్నీలో ఎలాంటి స్పెషాలిటీ కనిపించడం లేదు. ఫార్మాట్‌ సో సోగానే ఉంది, ఆటకూడా అలాగే ఉంది...’ అంటూ కామెంట్ చేయగా, తాజాగా ఆసీస్ మాజీ క్రికెటర్ ఇయాన్ చాపెల్ కూడా హండ్రెడ్ బాల్స్ ఫార్మాట్ అవసరం లేదని కామెంట్ చేశాడు...

click me!