ఒలంపిక్స్ లో సత్తా చాటుతున్న కోనసీమ కుర్రాడు..!

By telugu news teamFirst Published Jul 24, 2021, 2:14 PM IST
Highlights

సాత్విక్.. పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందాడు. కాగా.. సాత్విక్.. బంగారు పతకంతో తిరిగి రావాలని ఆయన కుటుంబసభ్యులతోపాటు.. అభిమానులు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు.

టోక్యో ఒలంపిక్స్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ ఒలంపిక్స్ లో..  కోనసీమ కుర్రాడు సత్తాచాటుతున్నాడు. అమలాపురానికి చెందిన రంకిరెడ్డి సాయి రాజ్ సాత్విక్.. టోక్యో ఒలంపిక్స్ లో బ్యాడ్మింటన్ డబుల్స్ ఆడుతున్నాడు. ఈ రోజు తొలి మ్యాచ్ జరగగా.. ఇప్పటికే ఫస్ట్ రౌండ్ లో విజయం సాధించాడు.

సాత్విక్, చిరాగ్ శెట్టి జంట డబుల్స్ లో పోటీపడ్డారు. కాగా.. ఇప్పటికే తొలి రౌండ్ లో తమ సత్తా చాటారు. కాగా.. సాత్విక్.. పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందాడు. కాగా.. సాత్విక్.. బంగారు పతకంతో తిరిగి రావాలని ఆయన కుటుంబసభ్యులతోపాటు.. అభిమానులు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు.

సాత్విక్ ట్రాక్ రికార్డ్..
ట్రాక్‌ రికార్డు 
► 2018 ఆస్ట్రేలియా కామన్‌వెల్త్‌ పోటీల్లో మిక్స్‌డ్‌ డబుల్స్‌ టీమ్‌ విభాగంలో అశ్వనీ పొన్నప్పతో కలిసి గోల్డ్‌ మెడల్‌
►  డబుల్స్‌ విభాగంలో చిరాగ్‌ శెట్టితో కలిసి సిల్వర్‌ మెడల్‌   
►  2018లో హైదరాబాద్‌ ఓపెన్, 2019లో థాయిలాండ్‌ ఓపెన్‌ డబుల్స్‌ విభాగంలో స్వర్ణపతకాలు 
►  2018 సయ్యద్‌ మోడీ అంతర్జాతీయ టోర్నీ, 2019 ఫ్రెంచ్‌ 
►  డబుల్స్‌లో చిరాగ్‌ శెట్టితో  2016లో మౌరిటీస్‌ ఇంటర్‌ నేషనల్, ఇండియన్‌ ఇంటర్‌నేషనల్‌ సిరీస్, టాటా ఓపెన్‌ ఇండియా ఇంటర్నేషనల్, బంగ్లాదేశ్‌ ఇంటర్నేషనల్, 2017లో వియత్నామ్‌ ఇంటర్నేషనల్, 2019 బ్రేజిల్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీలలో విజయం

కాగా.. సాత్విక్ టోక్యో ఒలంపిక్స్ కి వెళ్లడం పట్ల అతని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాత్విక్ తండ్రి కూడా బ్యాడ్మింటన్ ప్లేయర్ కావడం గమనార్హం. తన ఇద్దరు కుమారులను శిక్షణ ఇచ్చానని.. ఇద్దరిలో ఒక్కరైనా దేశానికి ప్రాతినిథ్యం ఇస్తే చాలని అనుకున్నానని.. ఇప్పుడు ఆ కల నెరవేరిందని సాత్విక్ తండ్రి చెప్పాడు.

click me!