టోక్యో ఒలింపిక్స్: అదరగొట్టిన టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నగల్... లియాండర్ పేస్ తర్వాత...

Published : Jul 24, 2021, 12:39 PM ISTUpdated : Jul 24, 2021, 12:45 PM IST
టోక్యో ఒలింపిక్స్: అదరగొట్టిన టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నగల్... లియాండర్ పేస్ తర్వాత...

సారాంశం

ఒలింపిక్ మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో గెలిచిన సుమిత్ నగల్... లియాండర్ పేస్ తర్వాత ఒలింపిక్స్‌లో సింగిల్స్ మ్యాచ్ గెలిచిన భారత టెన్నిస్ ప్లేయర్‌గా రికార్డు...

టోక్యో ఒలింపిక్స్ 2020లో మెన్స్ టెన్నిస్ సింగిల్స్ బరిలో నిలిచిన ఏకైక భారత ప్లేయర్ సుమిత్ నగల్, మొదటి రౌండ్‌లో అద్భుత విజయం సాధించాడు. డెన్నిస్ ప్లేయర్  ఇస్టోమిన్‌ను 6-4, 6-7, 6-4 తేడాతో ఓడించి రెండో రౌండ్‌కి దూసుకెళ్లాడు.

భారత టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్ తర్వాత ఒలింపిక్ సింగిల్స్‌లో విజయాన్ని అందుకున్న మొదటి టెన్నిస్ ప్లేయర్‌గా నిలిచాడు సుమిత్ నగల్. రౌండ్ 32లో సుమిత్ నగల్, డానిల్ మెద్వేదేవ్‌తో తలబడనున్నాడు. 

భారత వుమెన్ వెయిట్ లిఫ్టర్ మీరాభాయ్ ఛాను రజత పతకాన్ని సాధించి చరిత్ర క్రియేట్ చేసింది. 2000 ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన కరణం మల్లీశ్వరి తర్వాత వెయిట్ లిఫ్టింగ్‌లో ఒలింపిక్ పతకం సాధించిన భారత అథ్లెట్‌గా నిలిచిన మీరాభాయ్ ఛాను, రజతం సాధించిన మొట్టమొదటి భారత మహిళా వెయిట్ లిఫ్టర్‌గా నిలిచింది.

PREV
click me!

Recommended Stories

IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !
T20 World Cup 2026 : టీమిండియాలో ముంబై ఇండియన్స్ హవా.. ఆర్సీబీ, రాజస్థాన్‌లకు మొండిచేయి !