Tokyo Olympics: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్స్ లో సౌరభ్ చౌదరి ఓటమి

By team teluguFirst Published Jul 24, 2021, 12:42 PM IST
Highlights

భారత్ ఏస్ షూటర్ 19 ఏండ్ల సౌరభ్ చౌదరి పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్స్ లో ఎలిమినేట్ అయ్యాడు.

భారత్ ఏస్ షూటర్ 19 ఏండ్ల సౌరభ్ చౌదరి పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్స్ లో ఎలిమినేట్ అయ్యాడు. ఉదయం జరిగిన క్వాలిఫికేషన్స్ లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన సౌరభ్ టాప్ టెన్ లో స్థానం సంపాదించాడు. కానీ ఫైనల్స్ లో 7వ స్థానంతో సరిపెట్టుకోవాలిసి వచ్చింది. 

కానీ అనుభవలేమి, చిన్న వయసు అవడం వల్ల బహుశా ఈ విశ్వా క్రీడల్లోని ప్రెజర్ కి లోనైనా సౌరభ్... తన పూర్తి స్థాయి ప్రదర్శనను చేయలేకపోయాడు. రెండవ రౌండ్ లోనే సౌరభ్ ఎలిమినేట్ అయ్యాడు. 

ఇంకా మిక్స్డ్ షూటింగ్ ఈవెంట్ లో కూడా సౌరభ్ పోటీ పడనున్నాడు. ఈ ఈవెంట్ పై భారత్ చాలా ఆశలు పెట్టుకుంది. భారత్ కి చందిన మరో 19 సంవత్సరాల షూటర్ మను బాకర్ తో కలిసి పోటీ పడనున్నాడు. 

ఇక ఉదయం జరిగిన క్వాలిఫయర్స్ లో సౌరభ్ చౌదరి ఫస్ట్ సిరీస్ లో 100 కు 95 పాయింట్లు సాధించాడు. అందులో 10 ఇన్నర్ టెన్స్ ను స్కోర్ చేసాడు. మొత్తంగా అయిదు '10 పాయింటర్' షాట్స్ ను ఆ తరువాత అయిదు '9 పాయింటర్' షాట్లను కాల్చాడు సౌరభ్ చౌదరి. ఆతరువాత సెకండ్ సిరీస్ లో 98 పాయింటర్లను సాధించి అబ్బురపరిచారు. మూడవ రౌండ్లో కూడా 98 పాయింట్లు సాధించి తన పూర్తి దృష్టిని లక్ష్యంపై మాత్రమే నిలుపుతూ దూసుకెళ్లాడు. 

ఇక నాలుగవ సిరీస్ లో సౌరభ్ చౌదరి తానెందుకు మేటి షూటర్నో నిరూపిస్తూ 100 పాయింట్లను సాధించాడు. సౌరభ్ చౌదరిని అక్కడ షూటింగ్ ప్రాంగణంలో చూసిన వారెవరు కూడా అభినందించకుండా ఉండలేకపోయారు. నెక్స్ట్ సిరీస్ లతో 98 పాయింట్లను సాధించి టేబుల్ టాపర్ గా నిలిచాడు. మొత్తంగా 600 పాయింట్లకు గాను 586 పాయింట్లు సాధించిన సౌరభ్ చౌదరి ఫైనల్స్ లోకి దూసుకెళ్లాడు. మరో షూటర్ అభిషేక్ వర్మ ఫైనల్స్ లోకి ప్రవేశించలేకపోయాడు. 

ఈ ఈవెంట్ లో ఇరాన్ స్వర్ణం సాధించింది. ఇకపోతే భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను సిల్వర్ మెడల్ సాధించి భారత్ పతకాల ఖాతా తెరిచింది.  49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో స్నాచ్‌లో మొదటి ప్రయత్నంలో 84 కేజీలను ఎత్తిన మీరాభాయ్, రెండో ప్రయత్నంలో 87కేజీలు ఎత్తి... తొలి హాఫ్‌లో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. 

చైనా వెయిల్ లిఫ్టర్ హో జీహుయ్ 94 కేజీలు లిప్ట్ చేసి అగ్రస్థానంలో నిలిచింది. తొలి ప్రయత్నంలో 110 కేజీలు ఎత్తిన మీరాభాయ్ ఛాను, రెండో ప్రయత్నంలో 115 కేజీలను లిఫ్ట్ చేసి అదరగొట్టింది. మూడో ప్రయత్నంలో 117 కేజీలను ఎత్తేందుకు చేసేందుకు ప్రయత్నం విఫలమైంది. చైనా వెయిట్ లిఫ్టర్ హో జీహుయ్ టాప్‌లో నిలిచి, స్వర్ణం సాధించింది.

2000 ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన తెలుగు అథ్లెట్ కరణం మల్లీశ్వరి తర్వాత వెయిట్ లిఫ్టింగ్‌లో మెడల్ సాధించిన భారత వెయిట్ లిఫ్టర్‌గా నిలిచింది మీరాభాయి ఛాను... వెయిట్ లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించిన మొట్టమొదటి భారత మహిళా వెయిట్ లిఫ్టర్‌గా సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది మీరాభాయి ఛాను... 

click me!