అది మందలింపు కాదు..వ్యక్తిగత విమర్శలు: అక్తర్ వ్యాఖ్యలపై సర్ఫరాజ్

By sivanagaprasad kodatiFirst Published Jan 30, 2019, 12:27 PM IST
Highlights

దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ పెహ్లూక్వాయోపై జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన పాక్ క్రికెట్ కెప్టెన్ సర్పరాజ్ అహ్మద్ సస్పెన్షన్‌కు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతన్ని సౌతాఫ్రికా పర్యటన నుంచి పీసీబీ అర్థాంతరంగా వెనక్కి పిలిపించింది. 

దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ పెహ్లూక్వాయోపై జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన పాక్ క్రికెట్ కెప్టెన్ సర్పరాజ్ అహ్మద్ సస్పెన్షన్‌కు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతన్ని సౌతాఫ్రికా పర్యటన నుంచి పీసీబీ అర్థాంతరంగా వెనక్కి పిలిపించింది. ఈ క్రమంలో జాతి వ్యతిరేక వ్యాఖ్యల గురించి పాక్ మీడియా అతన్ని ప్రశ్నించింది.

తాను చేసింది తప్పేనని ఒప్పుకున్న సర్ఫరాజ్ ఈ విషయంలో పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ తనపై చేసిన వ్యాఖ్యలపై స్పందించాడు. ఈ వివాదంలో అక్తర్ చేసిన వ్యాఖ్యలు కేవలం మందలించడానికి చేసినట్లుగా తనకు అనిపించడం లేదని, అవి వ్యక్తిగతంగా టార్గెట్ చేసినట్లుగానే తోస్తున్నాయన్నాడు.

ఐసీసీ తనపై విధించిన నిషేధాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపాడు. అదే సమయంలో ఈ వివాదాన్ని సానుకూలంగా సమసిపోయేలా చేయడంలో ఎంతో కృషి చేసిన పాక్ క్రికెట్ బోర్డుకు, తనకు అండగా నిలిచిన వారికి సర్ఫరాజ్ ధన్యవాదాలు తెలిపాడు.

గతాన్ని మరచిపోయే వ్యక్తిగతంగా నన్ను నేను మార్చుకునేందుకు ఈ ఉదంతం సాయపడుతుందని అహ్మద్ వ్యాఖ్యానించాడు.  మ్యాచ్ సందర్భంగా బ్యాటింగ్ చేస్తోన్న పెహ్లూక్వాయో పట్ల అప్పటికే అసహనంతో ఉన్న సర్ఫరాజ్ తన నోటికి పనిచెప్పాడు.

‘‘ ఏయ్ నల్లోడా.. మీ అమ్మ ఇప్పుడెక్కడ కూర్చొంది.. నీ గురించి ఆమెను ఏం ప్రార్ధించమన్నావ్’’ అంటూ ఉర్దూలో వ్యాఖ్యానించాడు. ఆ మాటలు స్టంప్స్ మైకుల్లో స్పష్టంగా రికార్డ్ అవ్వడంతో క్రికెట్ ప్రపంచం ఉలిక్కిపడింది. దీంతో సర్ఫరాజ్‌పై అభిమానులు, మాజీ క్రికెటర్లు మండిపడ్డారు.

పాక్ జట్టు మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ సైతం సర్ఫరాజ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘అతను చేసిన వ్యాఖ్యలు ఏ పాక్ పౌరుడు కూడా హర్షించడన్నాడు. ఈ వ్యాఖ్యలు ఏ మాత్రం సమర్థనీయం కావు, వీటిని తాను తీవ్రంగా ఖండిస్తున్నాను.. నరాలు తెగే ఉత్కంఠ మధ్య మ్యాచ్ సాగుతున్న సమయంలో అతను ఆ మాటలు అని వుండొచ్చు.

అంత మాత్రం చేత అలా మాట్లాడటం తప్పే.. కాబట్టి సర్ఫరాజ్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని’’ అక్తర్ డిమాండ్ చేశాడు. దక్షిణాఫ్రికా జట్టు కానీ, బోర్డు కాని ఫిర్యాదు చేయనప్పటికీ ఐసీసీ ఈ వివాదంపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టింది. అతనిపై నాలుగు మ్యాచ్‌ల నిషేధాన్ని విధించింది. దీంతో చివరి రెండు వన్డేలు, రెండు టీ20లకు సర్ఫరాజ్ దూరమయ్యాడు. 

జాతి వ్యతిరేక వ్యాఖ్యలు: ఫలించిన ఇంజమామ్ కృషి, సర్పరాజ్‌కు తగ్గిన శిక్ష

జాతి వివక్ష వ్యాఖ్యలు: పాక్ కెప్టెన్‌ సర్ఫరాజ్‌పై వేటు... క్షమాపణలు చెప్పినా

‘‘మేం క్షమించాం.. కానీ’’: సర్ఫరాజ్ వ్యాఖ్యలపై డుప్లిసెస్ కామెంట్స్

‘‘ఏయ్ నల్లోడా.. మీ అమ్మ’’ అంటూ పాక్ కెప్టెన్ వివాదాస్పద వ్యాఖ్యలు

 

click me!