ఈ టీం ఎక్కడ ఆడినా ప్రపంచ విజేతే...: సచిన్

By Arun Kumar PFirst Published Feb 4, 2019, 5:02 PM IST
Highlights

గతంలో దిగ్గజ ఆటగాళ్లతో కూడిన జట్టుకు సాధ్యం కాని విజయాలను కూడా ప్రస్తుతం యువ భారత జట్టు సాధిస్తోంది. క్రికెట్ చరిత్రలోనే ఇప్పటివరకు ఆస్ట్రేలియా గడ్డపై భారత్ టెస్ట్ సీరిస్ గెలిచిన దాఖలాలు లేకుంటే ఆ కలను కొద్దిరోజుల క్రితమే కోహ్లీ సేన నెరవేర్చింది. దానికి తోడు ప్రపంచ కప్ కు ముందు ఆస్ట్రేలియా,న్యూజిలాండ్ లపై వారి స్వదేశంలోనే వన్డే సీరిస్ లను కైవసం చేసుకుని టీంఇండియా రెట్టించిన ఉత్పహంతో ఉంది. ఈ జోష్ ను మరింత పెంచేలా ప్రస్తుత జట్టుపై లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. 

ప్రస్తుతం అనుభజ్ఞులు, యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు కూర్పు చాలా బాగుందని సచిన్ అన్నాడు. ఈ జట్టు ఇంగ్లాండ్ లోనే కాదు...ప్రపంచంలో ఎక్కడ వరల్డ్ కప్ నిర్వహించినా గెలవగలదంటూ ఆకాశానికెత్తేశాడు. భారత జట్టు గత కొంత కాలంగా వరుస విజయాలతో దూసుకుపోవడం, సరికొత్త రికార్డులను నెలకొల్పడం  వంటి  వాటిని చూసి ఇలా మాట్లాడటం లేదని...కేవలం జట్టు కూర్పు, ఆటగాళ్ల ప్రదర్శనను బట్టే ఈ నమ్మకం ఏర్పడిందన్నారు. ప్రపంచ విజేతగా నిలవడానికి ప్రస్తుతమున్న భారత జట్టుకు అన్ని అర్హతలున్నాయని సచిన్ పేర్కొన్నారు. 

ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీలో టీంఇండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోందని  సచిన్ తెలిపారు. ఈ టోర్నీలో పాల్గొంటున్న మిగతా జట్లకు బలమైన ప్రత్యర్ధి ఎవరైనా వున్నారంటే అది భారత జట్టేనని అన్నారు. ప్రపంచ కప్ లో ఎలాంటి పిచ్ లు రూపొందించినా భారత ఆటగాళ్ల జోరును అడ్డుకోలేరని...తమ సత్తా చాటడానికి జట్టు మొత్తం సిద్దంగా వుందని సచిన్ తెలిపారు.   
 
click me!