క్రిస్ గేల్ రికార్డ్ బద్దలుకొట్టిన రోహిత్ శర్మ

By ramya neerukondaFirst Published Jan 16, 2019, 10:32 AM IST
Highlights

ఈ మ్యాచ్‌లో రెండు సిక్సర్లు కొట్టడం ద్వారా ఒకే ప్రత్యర్థిపై అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ రికార్డులకెక్కాడు.

టీం ఇండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ.. తన ఖాతాలో మరో రికార్డ్ ను వేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో రోహిత్ రెండు సిక్సర్లు కొట్టి రికార్డు నెల కొల్పాడు. ఈ రెండు సిక్సర్లతో విండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ రికార్డ్ ని రోహిత్ బద్దలు కొట్టాడు.

ఈ మ్యాచ్‌లో రెండు సిక్సర్లు కొట్టడం ద్వారా ఒకే ప్రత్యర్థిపై అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ రికార్డులకెక్కాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు క్రిస్‌గేల్‌ పేరుపై ఉంది. ఇంగ్లండ్‌పై గేల్ 88 సిక్సర్లు కొట్టి ఈ జాబితాలో ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పుడా రికార్డును రోహిత్ అధిగమించాడు. 89 సిక్సర్లతో గేల్‌ను వెనక్కి నెట్టేశాడు. 195 వన్డేలాడిన రోహిత్ మొత్తం 210 సిక్సర్లు బాదాడు. ఇందులో ఆస్ట్రేలియాపై కొట్టినవే 89 కావడం విశేషం.

మరిన్ని సంబంధిత వార్తలు

ఈ విజయం నాది కాదు...ఆయనదే: కోహ్లీ

జడేజా షార్ప్ త్రో చూశారా: ఖవాజాకు షాక్

ఆసీస్ పై భారత్ విజయం: ధోనీయే ఫినిషర్, సిరీస్ సమం

click me!