పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో బద్దలైన రికార్డులు.. దిగ్గజాల సరసన రోహిత్-ధావన్

By sivanagaprasad kodatiFirst Published Sep 24, 2018, 12:21 PM IST
Highlights

ఆసియా కప్‌ సూపర్ 4లో భాగంగా భారత్-పాకిస్తాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌‌లో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ-శిఖర్ ధావన్‌లు అనేక రికార్డులు బద్ధలు కొట్టారు. ఆదివారం నాటి మ్యాచ్‌లో వీరిద్దరూ సెంచరీలతో కదంతొక్కి జట్టును గెలిపించారు.

తొలి వికెట్‌కు 210 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. తద్వారా లక్ష్య ఛేదనలో తొలి వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యాన్ని సాధించిన జోడిగా రికార్డుల్లోకి ఎక్కింది. ఇంతకు ముందు 2009లో సెహ్వాగ్-గంభీర్‌లు న్యూజిలాండ్‌పై 209 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

అలాగే తొలి వికెట్‌కు ఎక్కువసార్లు 100 పరుగులు సాధించిన రెండో భారత ఓపెనింగ్ జోడిగా రోహిత్-ధావన్‌లు నిలిచారు. ఒకే మ్యాచ్‌లో పాక్‌పై ఇద్దరు బ్యాట్స్‌మెన్ సెంచరీలు చేయడం ఇది మూడోసారి ఇంతకు ముందు సచిన్-సిద్ధూ, సెహ్వాగ్-ద్రవిడ్, ఇలా ఒకే మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై సెంచరీలు చేశారు. అలాగే వన్డేల్లో 7 వేల పరుగులు పూర్తి చేసుకున్న ఏడో భారత బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ ఘనతను కేవలం 181 ఇన్నింగ్స్‌ల్లోనే రోహిత్ అందుకున్నాడు.
 
click me!